KGF: కేజిఎఫ్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా సీక్వెల్ చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 ద్వారా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాప్టర్ 3 కూడా ఉంటుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాప్టర్ 3 గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విధంగా ఒక సినిమా తర్వాత మరొక సినిమా తీస్తూ ప్రశాంత్ నీల్ ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.మార్వెల్ అద్భుత శక్తులున్న సూపర్ హీరోలతో ఓ ప్రపంచాన్ని సృష్టిస్తే.. ప్రశాంత్ నీల్ కూడా యాక్షన్ హీరోలతో కేజీఎఫ్ చుట్టూ కథ నడిచే ఓ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తనకు ఒక కల ఉందని అయితే ఆ కల కోరిక ఏంటి అనేది అది నెరవేరినప్పుడే చెబుతానని తెలియజేశారు.అది సౌత్ సినిమాలతో ప్రశాంత్ నీల్ ఒక యూనివర్స్ క్రియేట్ చేయవచ్చు. కేజిఎఫ్ చాప్టర్ 2 చివరిలో హీరో బంగారం తో సహా సముద్రంలోకి దూకుతాడు. అయితే ఈ సినిమా మరో సినిమాకి లింక్ అవుతూ ఇలా సౌత్ ఇండస్ట్రీలో పలువురు యాక్షన్ హీరోలతో కలిసి ఈయన ఒక యూనివర్స్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఇక కేజిఎఫ్ చాప్టర్ 3, సోలార్ సినిమాకి కూడా సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలార్ సినిమా కూడా గనుల నేపథ్యంలోనే తెరకెక్కడం ఇందుకు నిదర్శనం.టైమ్ లైన్‌ను బేస్ చేసుకుని మరికొన్ని సినిమాలను కేజీఎఫ్‌తో లింక్ చేయవచ్చు అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యశ్, ప్రభాస్ సినిమాలను ఎన్టీఆర్ 31 సినిమాతో, అలాగే మరి కొందరు హీరోలతో కలిసి హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లాగా ప్రశాంత్ యాక్షన్ హీరోలందరితో కలిసి యాక్షన్ వర్డ్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…