KL Rahul: బాలీవుడ్ స్టార్ హీరో కూతురితో ఏడడుగులు వేయనున్న కేఎల్ రాహుల్…పెళ్లేప్పుడంటే!
KL Rahul: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు, క్రికెటర్లకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు క్రికెటర్లతో ప్రేమలో పడుతూ పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే మరికొందరు లవ్ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం చాలామంది సినీ సెలబ్రిటీలు క్రికెటర్లను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో మరొక క్రికెటర్ కూడా స్టార్ హీరో కూతురిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఐపీఎల్ లో సెంచరీల పై సెంచరీలు కొడుతూ క్రికెట్ అభిమానులను సందడి చేస్తున్న కె.ఎల్.రాహుల్ గత కొంతకాలం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టీని ప్రేమిస్తున్నారు.
గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలలో తెలియడంతో వీరి ప్రేమ పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అతీయా విషయానికి వస్తే ఈమె సునీల్ శెట్టి కుమార్తెగా హీరో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.అనంతరం ముబారకన్, నవాబ్జాదె, మోతీచూర్ ఛక్నాచూర్ మూవీల్లో మెరిసింది. ఇలా స్టార్ హీరో కూతురుగా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నారు. ఇక వీరి ప్రేమ గురించి పెద్దలకు తెలియడంతో పెద్దల అంగీకారంతో ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…