Kiccha Sudeep : కన్నడలో అగ్ర హీరోగా ఉంటూ కన్నడ ప్రేక్షకులకు చేత ‘కిచ్చ’ అంటూ ముద్దుగా పిలిపించుకుంటున్న హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి గారి ‘ఈగ’ సినిమా ద్వారా పరిచయం. ఆ సినిమాలో విలన్ గా ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఇటీవలే ఆయన కన్నడ సినిమా ‘విక్రాంత్ రోణా’ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వర్మ నన్ను ఎపుడో పాన్ ఇండియా స్టార్ ని చేసాడు…
కిచ్చ సుదీప్ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ నుండి అందరు ఆర్టిస్టులు కలిసి పనిచేస్తున్నారు, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. కానీ అటువంటి సమయంలో నన్ను నమ్మి ఆర్జీవి ‘ఫూంక్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అసమయంలో ఆర్జీవి తన కెరీర్ లో చాలా పీక్స్ లో ఉన్నాడు. బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్ అటువంటి వ్యక్తి నన్ను పెట్టుకోవడం నా లక్ అంటూ తెలిపారు.
ఇక ఆ సినిమా తరువాత మరోసారి ‘రాన్’ సినిమాలో అమితాబ్ తో నటించే అవకాశం ఇచ్చింది వర్మనే అంటూ చెప్పారు. ఆర్టిస్ట్ గా ఒక లెజెండ్ తో పనిచేయాలని కళ ఉంటుంది, వర్మ వల్ల నా కోరిక తీరింది. అమితాబ్ బచ్చన్ తో నటించగలిగాను అంటూ చెప్పారు. ఆ సినిమా చూసాకే రాజమౌళి ఈగ సినిమాలో నన్ను తీసుకున్నారు. అలా వర్మ నే నన్ను పాన్ ఇండియా స్టార్ ను చేసాడు అంటూ తెలిపారు సుదీప్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…