అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.అందుకు గల కారణం నాగార్జున ఇద్దరు కొడుకులు నటించిన సినిమాలు ఈ ఏడాది వరుసగా విజయాలు సాధించడంతో అక్కినేని కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.చైతన్య లవ్ స్టోరీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అద్భుతమైన విజయాలు సాధించడంతో నాగార్జున జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస ఫ్లాపులతో ఎదుర్కోవడంతో అఖిల్ విషయంలో నాగార్జున తీవ్ర ఆందోళన చెందినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన నాలుగవ సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ ని నమ్మి అతని దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ కు అవకాశం ఇప్పించారు.
ఇలా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులను సృష్టించడంతో అటు చిత్ర బృందం, ఇటు అక్కినేని కుటుంబం ఎంతో సంతోషంలో ఉన్నారు.
నాలుగు సంవత్సరాలుగా విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ విధమైనటువంటి విజయం దక్కడంతో అందుకు కారణమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర బృందానికి నాగార్జున పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అఖిల్ తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వగా నాగార్జున కూడా సినిమా నిర్మాతలకు అలాగే మిగిలిన చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…