Kiran Abbavaram: తెలుగులో రాజావారు రాణివారు ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబాస్టియన్ వంటి సినిమాల ద్వారా నటుడిగా పరిచయమయ్యారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఇక ఈయన వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు.
ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాను ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చానని..తానేమి స్టార్ హీరో కాదని ఈయన తెలియజేశారు అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే తనని ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలియజేశారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తాను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఈయన తెలిపారు. ఇక ఒక సినిమా టైటిల్ కార్డ్స్ లో తాను పవర్ స్టార్ అనే ట్యాగ్ వేయించుకోకపోయినా కొందరు ఎడిట్ చేసి పవర్ స్టార్ అనే ట్యాగ్ వేశారని, అయితే ఈ విషయం గురించి తనని చాలామంది ట్రోల్ చేశారంటూ కిరణ్ అబ్బవరం వెల్లడించారు.
ఈ విషయంపై ఎంతోమంది మెగా, పవన్ అభిమానులు తనని ఎందుకు ఈ ట్యాగ్ తగిలించుకున్నావు అంటూ ట్రోల్ చేశారని ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీలో తనపై కొందరు సాధిస్తున్న కక్షపూరితమైన చర్యల గురించి బయటపెట్టారు. దీంతో కిరణ్ అబ్బవరం చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…