Comedian Paakija : తమిళ నటి వాసుకి అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ తెలుగులో ‘పాకీజా’ అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. బ్రహ్మానందం, పాకీజా కామెడి 90 దశకంలో వచ్చిన ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ అయింది. తెలుగులో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించిన పాకీజా సినిమా అవకాశాలు తగ్గాక తెలుగు తెరకు దూరమైంది, దాదాపు కనిపించలేదు. అయితే చాలా కాలం తరువాత చెన్నైలో తెలుగు మీడియా ప్రతినిధికి కనిపించిన పాకీజా ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందులతో తిండి గడవడం కూడా కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్కపూట గడవడం కూడా కష్టమే…
ఎన్నో తెలుగు తమిళ సినిమాల్లో నటించిన పాకీజా అసలు పేరు వాసుకి. తమిళ నాడుకు చెందిన వాసుకి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చెన్నై లో కష్టంగా ఉందని సొంతూరు మధురై వద్ద చిన్న గ్రామంలో జీవిస్తున్నారు. ఆమె అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. యూట్యూబ్ ఛానెల్ అయిన సుమన్ టీవీ యాంకర్ రోషన్ కు అనుకోకుండా రోడ్డు మీద కనిపించిన పాకీజా తన పరిస్థితి చెప్పి ఎమోషనల్ అయ్యారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న పాకీజ కు గర్భాశయం తీసేశారట.
ఇక ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో ఒక పూట గడవడం కష్టంగా ఉందంటూ తెలిపారు. స్నేహాతురాలిని కలవడానికి చెన్నై వచ్చానని ఫ్రీ బస్ లో వెళ్లడానికి రోడ్డు మీద ఎదురుచూస్తున్నట్లు తెలిపిన పాకీజాకు స్టార్ హోటల్ కి తీసుకెళ్లి యాంకర్ రోషన్ భోజనము పెట్టించగా ఇలాంటి మంచి భోజనం తిని ఆరు నెలల పైనే అయిందంటూ రెండు ఇడ్లీలు తినాలన్నా కష్టమైందంటూ చెప్పారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి ఎన్నోసార్లు సహాయం చేయమని అడిగినా పట్టించుకోలేదని, ఏవైనా తెలుగులో సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ అవకాశాలు ఉంటే ఇప్పించామంటూ అడిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…