Featured

Kirrak RP : పంచ్ ప్రసాద్ కి నా డబ్బులతో కిడ్నీ ఆపరేషన్ చేపిస్తా.. వాళ్ళు ఎవరూ పట్టించుకోవడం లేదు.. వాడి పరిస్థితి దారుణంగా ఉంది..: కిర్రాక్ ఆర్పీ

Kirrak RP : సినిమాల్లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాల్లో పనిచేసిన ఆర్పీ ఆపైన జబర్దస్త్ లో అదృష్టం పరీక్షించుకున్నాడు. జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది. రీ ఓపెన్ అయ్యాక కూడా బాగా బిజీగా ఉన్న హోటల్ గురించి అలాగే హోటల్ ద్వారా వచ్చే డబ్బులలో సమాజం కోసం వినియోగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

పంచ్ ప్రసాద్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను…

కిర్రాక్ ఆర్పీ తన హోటల్ బాగా సక్సెస్ అయిందని, అందరికీ నెల్లూరు చేపల పులుసు రుచి చూపించాలని అనుకుంటున్నట్లు అందుకే కష్టపడి హోటల్ కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇక కష్టపడి బాగా సంపాదిస్తున్నామని, లాభాలు బాగా వస్తున్నాయని తెలిపిన ఆర్పీ వచ్చిన దానిలో కొంత ఎవరికైనా సహాయం చేయడాని వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలా మొదట జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్న పంచ్ ప్రసాద్ కు సహాయం ఆందించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

పైకి ఆనందంగా ఉన్నా పంచ్ ప్రసాద్ పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలిపారు. తన చుట్టూ ఉన్నవాళ్లు పైకి నవ్వుతూ మాట్లాడిస్తూ మన అన్నట్లు ఉన్నారు కానీ ఎవరూ కావాల్సిన సహాయం చేయడం లేదని, అందుకే తనకు కిడ్నీ మార్పిడి చికిత్సకు కావలిసిన మొత్తం డబ్బులు పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ఆర్పీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago