Categories: FeaturedGeneral News

Kirrak RP : నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ లో జీతాలు ఎంత ఇస్తున్నారంటే… ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయిన కిర్రాక్ ఆర్పీ తండ్రి…!

Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు భాగనే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

నెగెటివ్ కామెంట్స్ కి ఎమోషనల్ అయిన ఆర్పీ తండ్రి…

జనాల డిమాండ్ కు సరిపడా వండించలేక పోయిన ఆర్పీ కర్రీ పాయింట్ ను తాత్కాలికంగా ముయించాడు. భారీగా జనం క్యూ కట్టడం వల్ల వాళ్లందరికీ సరిపడా వండించలేకపోతున్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరు మహిళలకు ఆఫర్ ఇచ్చాడు. నెల్లూరు చేపల పులుసు ఎవరైతే బాగా వండుతారో వాళ్ళు చేసి తీసుకువస్తే ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ హోటల్ ను రీ ఓపెన్ చేసారు. ఇక అక్కడ వంట విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోడానికి కిర్రాక్ ఆర్పీ తండ్రి కూడా అక్కడే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక ఆయన మాట్లాడుతూ హోటల్ మూసేసినపుడు చాలా మంది నెగెటివ్ గా మాట్లాడారంటూ ఎమోషనల్ అయ్యారు.

ఎవరు ఎన్ని మాటలు అన్నా మళ్ళీ కష్టపడి పైకి వస్తాం అంటూ మాట్లాడారు. ఉదయం నాలుగు నుండి పని ప్రారంభిస్తే రాత్రి 11 వరకు ఉంటుందంటూ రోజుకు 300 కేజీలకు పైగానే చేపలను వాడుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి పులుసు సరిగా రాకపోతే తీసేసి మళ్ళీ వండుతాం కానీ అదే జనాలకు పెట్టమని, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నామంటూ తెలిపారు. ఇక జీతాలు మాస్టర్లకు, అసిస్టెంట్ లకు అలా వేరుగా ఉంటాయని దాదాపు నలభై వేల వరకు జీతం తీసుకుంటున్నవారు ఉన్నారంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago