Categories: FeaturedMovie News

Balakrishna Fans : రికార్డులు ఉండేది మా హీరో పేరు మీదనే… బాలకృష్ణ కోసం ఏకంగా టాటూ వేసుకున్న అభిమాని…!

Balakrishna Fans : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. అఖండ సినిమా విజయంతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న బాలయ్య బాబు, క్రాక్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక థియేటర్ల ముందు ఫాన్స్ హంగమా మామూలుగా ఉండదు.

రికార్డులు తిరగరాస్తాడు… టాటూ తో అభిమానం…

బాలకృష్ణ అభిమానులు మాట్లాడుతూ వీర సింహా రెడ్డి ట్రైలర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేసారు. ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ చెప్పారు. సంక్రాంతికి విడుదల అయ్యే అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అయితే అందులో మా బాలయ్య బాబు వీర సింహా రెడ్డి మరింత ఘన విజయం సాధించాలంటూ కోరుకున్నారు.

ఇక మరో అభిమాని కార్తీక్ ఏకంగా నందమూరి బాలకృష్ణ రూపాన్ని టాటూ రూపంలో తన చేతి జబ్బ మీద వేయించుకున్నాడు. అలానే బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ రూపాన్ని ముంజెయి మీద వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్నపటి నుండి బాలయ్య అభిమానిని అంటూ ఆయన సినిమాల్లోనూ అలానే వ్యక్తిగత జీవితంలోనూ ఇష్టమంటూ చెప్పారు కార్తీక్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago