Vaasthu Doubts : పూర్వపు ఇళ్లల్లో అయితే కట్టెల పొయ్యి ఉండేది. అది రెండు పొయ్యిలే సాధారణంగా ఉంటాయి. అయితే మారుతున్న కాలానికి వాడుతున్న వస్తువులు జీవన సరళి అంతా మారిపోతూ ఉంది. అయితే ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా ఏ వస్తువులు ఏ దిక్కులో ఉంచాలి అన్నపుడు మాత్రం చాలా మంది వాస్తు శాస్త్రన్ని నమ్ముతారు, ఫాలో అవుతూ ఉంటారు. అయితే అన్నీ వాస్తు ప్రకారం చేసినా ఎక్కడో తెలియకుండా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు చాలా మంది. అలాంటి వాటిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టవ్ లలో కూడా రకరకాలుగా వచ్చేసాయి. వాటిలో కొన్నింటిని వాడే ముందు వాస్తు అనుకూలతన చూసుకోవాలంటూ వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు వివరిస్తున్నారు.
మూడు పొయ్యిలు ఉండకూడదు…
ఇప్పుడు కాలంలో ప్రతి ఇంట్లో మూడు లేదా నాలుగు పొయ్యిల స్టవ్ లు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకటి, రెండు, నాలుగు స్టవ్ లతో ఇబ్బంది లేదు కానీ మూడు పొయ్యిలు ఉండే స్టవ్ ఉండకూడదు అంటూ ఆయన చెప్పారు. మూడు అనేది గురువుకు సంబంధిచిన సంఖ్య. మనం ఇంట్లో పొయ్యి పెట్టేది ఆగ్నేయంలో అక్కడ గురువుకు సంబంధిచిన కారకుడు ఉండరాదు అంటూ తెలిపారు. అది అగ్నిని బలహీన పరుస్తుంది కాబట్టి మనకు ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తప్పవు అంటూ తెలిపారు.
ఇక నల్లగా ఉండే పొయ్యి, బ్లూ కలర్, తెలుపు రంగు స్టవ్ ఉండకూడదు అంటూ తెలిపారు. ఒకవేళ స్టవ్ పెట్టుకునే ప్లాట్ ఫామ్ కూడా నలుపు రంగులో ఉంటే స్టవ్ కింద మాత్రం ఆకుపచ్చ రంగు టైల్స్ వేయించుకుంటే సరిపోతుంది అంటూ తెలిపారు. అది కుదరదు అంటే ఒక ఆకుపచ్చ టేప్ ను స్టవ్ చుట్టూ అంటించినా సరిపోతుందని తెలిపారు. మూడు పొయ్యిలు ఉండే స్టవ్ ని ఇప్పుడు మార్చలేము కదా అనుకునేవాళ్లకు ఆ మూడు పొయ్యిల స్టవ్ పక్కన మరో ఒక పొయ్యి స్టవ్ పెట్టుకుంటే సరిపోతుంది అంటూ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…