Geetha Krishna : సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా అందరు హీరోల సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా పండగ పూట హడావిడి చేస్తుంటాయి. అయితే ఈ సారి పండగకు పెద్ద సినిమాలే కాకుండా తమిళం నుండి విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తోంది. ఇక చిన్న చిన్న సినిమలు చాలానే ఉన్నాయి. ఓవైపు మెగాస్టార్ మరోవైపు బాలయ్య, ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసాయి. అయితే సంక్రాంతి పండగ నాడు హిట్టుకొట్టి నిలిచేది ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎవరి ఫాన్స్ వాళ్ళ హీరో సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ చెబుతుంటే అసలు సంక్రాంతి గెలుపు పందెంకోడి ఎవరు అని విశ్లేషణ చెప్పారు డైరెక్టర్ గీతా కృష్ణ.
రెండు సినిమాలు రొటీన్ స్టోరీలే… యావరేజ్ గా నిలుస్థాయి…
ఒకవైపు మెగాస్టార్ మరో వైపు జై బాలయ్య.. వీళ్లిద్దరూ నటించిన సినిమాల పాటలు హిట్లయ్యాయి. ట్రైలర్లు ఆదరగొట్టాయి. ఇక సినిమా విడుదల దగ్గర్లో ఉండటంతో అసలు ఏ సినిమా జనాలకు నచ్చుతుంది ఏ సినిమా హిట్ అవుతుంది అన్న చర్చ మొదలయింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ గీతా కృష్ణ గారు ఆసక్తికర కామెంట్స్ చేసారు. రెండు సినిమాల్లోనూ రొటీన్ స్టోరీనే ఉందని, బాలయ్య సినిమా చూస్తే బి గోపాల్ దగ్గరి నుండి వస్తున్న ఫ్యాక్షన్ సినిమాలన్నీ కలిపి తీసినట్లు ఉందని, ఇక వాల్తేరు వీరయ్య కూడా చిరంజీవి పాత సినిమాలను పోలి ఉందని తెలిపారు. కమర్షియల్ గా రెండు సినిమాలు వాళ్ళ ఫాన్స్ కి నచ్చవచ్చు కానీ సాధారణ ప్రజలకు నచ్చడం ఉంది అంటూ తెలిపారు. టికెట్ పెట్టి చూసే జనాలకు కథ అన్నీ నచ్చితేనే చూస్తారు లేదంటే హీరో ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ సినిమా చూడరు అంటూ తెలిపారు.
ఇక చిరంజీవికి ఇప్పుడున్న యూత్ లో పెద్దగా ఫాలోయింగ్ లేదు, చరణ్ వాళ్ళ ఫాదర్ లాగానే ఆయనను చూస్తున్నారు. అయితే బాలకృష్ణ కు ఉన్న ఇమేజ్ చాలా డిఫరెంట్ గా ఉంది, జై బాలయ్య అనే సస్లోగన్ బాగా వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ తో వచ్చిన క్రేజ్ అలానే ‘అఖండ’ విజయం బాలకృష్ణ సినిమాకు ప్లస్ అవ్వొచ్చు. ఇక వాల్తేరు వీరయ్యలో రవితేజ కూడా నటించడం ఆ సినిమాకు ప్లస్ అవ్వొచ్చు అంటూ ఏదైనా చివరికి సినిమా ఫలితం చెప్పాల్సింది చూసే ప్రేక్షకులే అంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…