Bigg Boss Siri: యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి అనంతరం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఈమె మరింత పాపులర్ అయ్యారు. ఇక సీజన్ సిక్స్ కార్యక్రమంలో ఈమె ప్రియుడు శ్రీహాన్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు.అయితే వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమంలోకి పాల్గొనక ముందే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ వీడియోలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో కూడా పడ్డారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి సిరి శ్రీహన్ ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనీ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ వీరి పెళ్లి గురించి మాత్రం ఎప్పుడు స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా సిరి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు.
ఇలా అభిమానులతో మాట్లాడుతున్నటువంటి సిరి అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు శ్రీహాన్ పెళ్లి చేసుకోబోతున్నారా అనిప్రశ్నించడంతో సిరి అవును అని సమాధానం చెప్పారు. పెళ్లెప్పుడు అంటూ మరో ప్రశ్న వేయగా ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తెలియజేశారు.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తెలియజేసినప్పటికీ పెళ్లి తేదీ మాత్రం చెప్పలేదు. అయితే వీరిద్దరూ పెళ్లి కాకుండానే ఒక బాబుని దత్తత తీసుకొని ఆ బాబు బాధ్యతలను పూర్తిగా తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. గత రెండు రోజుల క్రితం సిరి శ్రీహాన్ తన కుమారుడితో కలిసి చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…