KK survey ceo: కేకే సర్వే ప్రస్తుతం నేషనల్ వైడ్ మారు మూగుతున్న పేరు. కిరణ్ కొండేటి సర్వే ద్వారా వెల్లడించిన ఫలితాలు ఏపీలో సంచలనంగా మారాయి. జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి అయితే ఇందులో భాగంగా చాలా సర్వేలు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పగా కేవలం కేకే సర్వే మాత్రం వైసిపి కేవలం 14 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా సంచలనం అయింది.
ఈయన ఇచ్చిన సర్వే ఫలితాలు చూసి అందరూ షాక్ అయ్యారు. బహుశా ఈయన కూటమి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఉంటారని అందుకే సర్వే ఫలితాలను ఇలా ఇచ్చారని పలువురు భావించారు. కేకే అంటే కమ్మ కాపు సర్వే అంటూ కూడా చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈయన చెప్పిన సర్వే 95% నిజం కావడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు.
ఈయన వైసీపీ 14 సీట్లకు పరిమితమవుతుందని చెప్పగా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం కిరణ్ కొండేటి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఈయన కలవాలి అనుకుంటే ఎప్పుడు డోర్స్ తెరిచే ఉంటాయి కానీ నాకు అవసరం లేదు వారిని కలిస్తే నాకు బొకే బొక్క నేనెందుకు కలుస్తానని ఈయన తెలిపారు.
రాజకీయ విమర్శలు..
వారికి నా అవసరం ఉంటే వాళ్లే వచ్చి నన్ను కలుస్తారు అంటూ కిరణ్ కొండేటి వెల్లడించారు. తాను ఎవరి పక్షాన ఉంటూ సర్వే చేయలేదని నిజా నిజాలను బయటకు తీసే క్రమంలో ఈ ఫలితాలు వెలబడ్డాయని తెలిపారు. నేను ఈ ఫలితాలు వెల్లడించిన తర్వాత మా ఎడిటర్ అలాగే మా బంధువులందరూ షాక్ అయ్యారు.వాళ్లకి జస్ట్ అవి నెంబర్లు మాత్రమే. కానీ నాకు జీవితం. దీనిపై చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. నాతో పనిచేసిన టీం కూడా నెంబర్లు ఎవరికీ చెప్పకూడదని అగ్రిమెంట్ కుదుర్చుకొని చివరి వరకు చాలా సీక్రెట్ గా ఉంచి ఫలితాలను వెల్లడించామని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…