Categories: FeaturedMovie News

తండ్రులను మించిన కూతుళ్లు..టాలీవుడ్ దర్శకుల కుమార్తెల గొప్పతనం తెలుసుకోవాల్సిందే

ఒక సినిమా విజయం సాధించిన ఫ్లాప్ అయినా దానికి పూర్తిగా బాధ్యత దర్శకుడిదే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెర వెనక ఒక దర్శకుడు పడే కష్టం సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అయితే టాలీవుడ్ లో మంచి దర్శకులు చాలానే ఉన్నారు. వారి గురించి చాల మందికి తెలిసిన వారి కుటుంబ విషయాలు మాత్రం చాల తక్కువగానే బయటకు వస్తాయి. ఇదంతా నిన్నటి వరకు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఏం చేసిన యిట్టె తెలిసిపోతుంది. అలాగే మన తెలుగు దర్శకుల కుమార్తెల విషయాలు కూడా అనేకం బయటకు వస్తున్నాయి. పేరుకు డైరెక్టర్స్ పిల్లలే అయినా వారిలో కూడా చాలా నైపుణ్యం ఉండి తండ్రులకు తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. మరి అలా తండ్రుల పేర్లు నిలబెడుతున్న తెలుగు దర్శకులు ఎవరు వారి కూతుర్ల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటగా పూరి జగన్నాద్. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ నుండి కొంచం తగ్గినా మల్లి గాడిలో పడిన పూరి గురించి ఎంత చెప్పిన తక్కువే. కోట్ల ఆస్తులు సంపాదించి అన్ని కోల్పోయి మల్లి పోగొట్టుకున్న చోటే సంపాదించుకుంటున్నాడు. మరి ఇంత స్మార్ట్ డైరెక్టర్ కూతురు ఇంకెంత స్మార్ట్ గా ఉంటుందో కదా. అందుకు ఏమాత్రం తీసిపోదు పూరి జగన్నాద్ కూతురు పవిత్ర. కొడుకు ని హీరో ని చేసిన పూరి కూతురిని కూడా ఇండస్ట్రీ లోకి తెచ్చే పనిలో ఉన్నాడు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన పవిత్ర దర్శకత్వంపై మక్కువ పెచుకుందట. అంతే కాదు సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. హీరోయిన్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న పవిత్ర త్వరలో తెర వెనక లేదంటే తెర ముందు కనిపించే అవకాశం వుంది.

ఇక ఇలా తండ్రి వారసత్వ మోయబోతున్న మరో దర్శకుడి కూతురు సుకృతి వేణి. దర్శకుడు సుకుమార్ గారాల పట్టి అయిన సుకృతి వయసులో చాల చిన్నదే అయినా ఇప్పటికే సుకుమార్ కి మంచి పేరు తీసుకోస్తుంది. స్వతహాగా సింగర్ అయినా సుకృతి Urban Jam With సుకృతి అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి అందులో సుకుమార్ పుట్టిన రోజు న తన పాటను అప్లోడ్ చేసి తండ్రికి అంకితం ఇచ్చింది.. సుకృతి ప్రతిభ చుసిన వారు సుకుమార్ కి సరైన కూతురు అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇక దర్శకుడు తేజ తన కొడుకును హీరోగా డెబ్యూ చేయించే ప్రయత్నంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ తేజ కుమార్తె గురించి ఎక్కడ కనిపించదు. తేజ కుమార్తె పేరు ఐలా తేజ ప్రస్తుతం అమెరికాలో Haas School of Business అఫ్ Berkeley లో మాస్టర్స్ చదువుకుంటుంది. చదువుకుంటూనే తాను ఒక మంచి స్పీకర్ గా అమెరికా లో బెర్కెలీ ఫోరమ్ తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది. యువత మేల్కోవాలని వారి ఐడియాస్ ని వ్యాపారదిశలో అభివృద్ధి చేసుకోవాలని సందేశం ఇస్తుంది. భవిష్యత్తులో మంచి స్పీకర్ గా అలాగే మంచి బిజినెస్ విమెన్ గా మారుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక గుణశేఖర్ కుమార్తెలు ఇద్దరు కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. గుణశేఖర్ పెద్ద కుమార్తె నీలిమ ఏకంగా అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. చిన్న కూతురు యుక్త సైతం సినీ రంగం పై మక్కువ ఉన్నట్టు త్వరలోనే 24 క్రాఫ్ట్స్ లో ఎదో ఒక జోనర్ లోకి ఆమె ప్రవేశిస్తుంది గుణశేఖర్ తెలిపారు.

వంశి పైడిపల్లి కుమార్తె ఆద్య మహేష్ బాబు గారాల పట్టి సితార తో కలిసి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. తనలోని నైపుణ్యాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది.

మరో దర్శకుడు మారుతీ సైతం తన కూతురిని తన సినిమా అయినా ప్రతి రోజు పండగే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టించాడు. త్వరలోనే పూర్తి స్థాయి నటీమణిగా మారుతుందని అయన అభిమానులు ఆశిస్తున్నారు.

రాజమౌళి కుమార్తె మయూఖ సైతం తన కుటుంబం మాదిరిగానే సినిమా ఇండస్ట్రీ కి వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago