Categories: FeaturedGeneral News

అభిలాష సినిమా టైపు లో చివరి క్షణంలో ఆగిన ఉరి శిక్ష.. మన దగ్గరే జరిగింది… ఎక్కడో తెలుసా?

ఇప్పుడు దేశం మొత్తం రెండు విషయాలపై మాత్రం చర్చ జరుగుతుంది. ఒక వైపు కరోనా వ్యాధి గురించి మరో వైపు నిర్భయ దోషులకు అమలు చేయబడ్డ ఉరి శిక్ష… కరోనా మహమ్మారిని దేశం ఈ రోజు కాకపోతే రేపు పారద్రోలుతుంది. కానీ మన వ్యవస్థలో ఉన్న లోపాలను మాత్రం మన చట్టాలు సవరించుకునే రోజు వస్తుందో లేదో చెప్పడం కష్టం. ఒక్క ఉరి శిక్ష వల్ల చట్టాల్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో దేశం మొత్తం కళ్లారా చూసింది. ఎపి సింగ్ కింది కోర్ట్ నుండి ఢిల్లీ హై కోర్ట్.. అక్కడ నుండి సుప్రీం కోర్ట్ ఇలా అన్ని కోర్టుల్లో ఎపి సింగ్ ఎత్తుగడలను చూసి జడ్జి లు కళ్ళు తిరిగిపోయాయంటే నమ్మండి. ఎనిమిదేళ్ల నుండి ఉరి శిక్ష గంట ముందు వరకు ఎన్ని రాక్షస ప్రయత్నాలు చేసాడో మీడియాలో చూస్తూ జనాలు నోరెళ్ళ బెట్టారు. కానీ ఎపి సింగ్ చివరికి తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. ఉరి శిక్షను ఆపలేకపోయాడు. నిర్భయ ఒళ్ళు ఛిద్రం చేసిన ఆ నలుగురిని ఉరి కొయ్యకు వేలాడేసి ఈ రోజు న్యాయ దేవత తన కళ్ళకు గంతలు కట్టలేదని నిరూపించుకుంది.

ఇదంతా ఒక పక్కన పెడితే ఉరిశిక్ష పైన అప్పుడెప్పుడో చిరంజీవి తీసిన అభిలాష సినిమా గుర్తుందా? ఈ సినిమాలో చిరంజీవి చేయని నేరానికి ఉరిశిక్ష వేయించుకొని ఆ శిక్ష నుండి ఎలా చివరి క్షణంలో బయటపడ్డాడు అనే కాన్సెప్ట్ తో సినిమా ఆసాంతం రక్తి కట్టించింది. అలా ఎపి సింగ్ కూడా నిర్బయ దోషులను చివరికంటా కాపాడాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు కానీ చిరంజీవి అభిలాష సినిమా లాంటి సంఘటన నిజ జీవితం లో కూడా జరిగింది. చివరి క్షణంలో ఉరి శిక్ష నుండి బయటపడ్డ సంఘటన అప్పట్లో ఒక సంచలనం.

అది 1993 ..చిలకలూరి పేటలో ఒక బస్సును దహనం చేసిన ఘటనలో 23 మంది అమాయక ప్రజలు మరణించారు. ఈ ఘటనకు కారణం అయినా చలపతిరావు, విజయవర్ధన్‌రావు అనే ఇద్దరు వ్యక్తులను దోషులుగా కోర్ట్ ముందు రుజువు చేయబడింది. 1995లో వీరిద్దరికి ఉరి శిక్ష విధిస్తు అప్పటి న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కింద కోర్ట్ నుండి సుప్రీం కోర్ట్ వరకు వాదనలు సాగాయి అంతిమంగా ఉరిని ఖరారు చేసారు. రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం రెండు సార్లు ప్రయత్నించినా అయన తిరస్కరించాడు. ఇక తెల్లారితే మూడు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉరి శిక్షకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పోలీసులను బంధువులను పిలిపించి నాలుగు గంటలకల్లా శవాలను అప్పగిస్తామని చెప్పారు. ఇక రెండు గంటల్లో అంత ముగియబోతుంది. అటు పోలీసులు తోటి ఖైదీలు బంధువులు అంత నిరీక్షిస్తున్నారు.

కానీ సరిగ్గా ఉరికి ఒక్క రోజు ముందు రచయిత్ర మహాశ్వేతాదేవి, మానవహక్కుల నేతలు కొందరు చివరి సారి ఎలాగైనా రాష్ట్రపతి ని కలిసి మరోసారి ఉరిశిక్షను రద్దు చేయాలని విన్నవించుకోవాలని కలిశారు. కానీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే రెండు సార్లు క్షమాబిక్షను రద్దు చేశాను ఇక నా చేతిలో ఏమి లేదు వెళ్ళండి అన్నారు. కానీ వారు అంతటితో ఆగితే ఒక చరిత్ర ను ఎలా రాయగలుగుతారు. అక్కడ నుండి తీర్పు ఇచ్చిన జడ్జి దగ్గరికి వచ్చారు. అయనను కలిసిన మానవ హక్కుల సంఘానికి చెందిన నాయకుల్లో ఒక మహిళ ఒక అబద్దం చెప్పాలి నిర్ణయించుకొని రాష్ట్రపతి సానుభూతితో పరిశీలిస్తామని చెప్పారు. అయన తన నిర్ణయాన్ని చెప్పేవరకు ఈ ఉరి శిక్షను వాయిదా వేయండి అంటూ చెప్పారు. ఆ జడ్జి ఆ విషయాన్నీ నమ్మాడు అలాగే బెంచ్ లో మరొక జడ్జి కూడా ఉన్నారు ఆయనకు కూడా చెప్పండి అనడం.. రాత్రికి రాత్రి మరో జడ్జి ని కూడా వెతికి పట్టుకొని విషయాన్ని చెప్పాడు, అయన కూడా సరే అనడం తో ఉరిని వాయిదా వేయడానికి ఆదేశాలు ఇచ్చారు.

ఒక అబద్దం ఇద్దరు జడ్జిలను బోల్తా కొట్టించింది. సీన్ మొత్తం మారిపోయింది. అప్పటికే రాత్రి 11 కావస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు కి సమచారం అందించాలి. కేంద్ర హోమ్ శాఖ ఇంటికి వెళ్లి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఇచ్చిన ఆర్డర్ ని చూపించగా నిద్ర కళ్ళను తుడుచుకొని ఒకటికి రెండు సార్లు నిజమే అని నిర్దారించుకున్నాక ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ కు ఫోన్ చేసి ఉరి ఆపాలని ఉత్తరువులు ఇచ్చారు. ఎపి హోమ్ శాఖ కార్యదర్శి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఫోన్ లో ఈ సమాచారం ఇచ్చాడు అప్పటికే అర్దరాత్రి దాటిపోయింది. కాసేపట్లో ఉరి కంభం వైపు ఇద్దరినీ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయం లో జైలు లో ఉన్న అధికారుల ఫోన్ కలవకపోయిన లేదంటే కేంద్రం నుండి ఆంధ్ర హోమ్ శాఖకు సమాచారం అందకపోయినా జరగవలసిన కార్యక్రమం జరిగేది. కానీ కలెక్టర్ రాజమండ్రి జైలు అధికారులకు కలెక్టర్ ఫోన్ లో విషయం చెప్పాడు.

అభిలాష సినిమా టైపు లో చివరి ఘడియల్లో ఉరి శిక్ష ఆగింది. ఇక్కడ ఉంది ఇంకొక సీన్ జరిగింది. ఈ శిక్ష వాయిదా పడ్డాక ప్రధాని దేవెగౌడ కుర్చీ దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం పడిపోయింది. ఈ పనుల్లో రాషట్రపతి బిజీ గా ఉండి ఒకముడు నెలల వరకు క్షమాబిక్ష పిటీషన్ ను పెట్ట్టించుకోలేదు. ఈ లోపు శంకర్ దయాళ్ శర్మ పదవి కలం పూర్తయి కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యాడు.. అప్పుడు మానవ హక్కుల నేతలు మల్లి క్షమాబిక్ష పిటీషన్ ని పెట్టుకోగా ఈ సారి ఉరిని తప్పించి యావజ్జీవ శిక్షగా మార్చారు.

ఇలా ఒక్క అబద్దం ఇద్దరు నేరస్థుల జీవితాలను మార్చేసింది. ఇప్పటికి చలపతి రావు, విజయవర్ధన్ ఇద్దరు నెల్లూరు సెంట్రల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. నిజంగా ఆ రోజు రాష్ట్రపతి ఆ పిటీషన్ పరిశీలిస్తామని చెప్పారా లేదా అని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఒకవేళ చేసి ఉంటె ఈ రోజు ఇంకోలా ఉండేది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago