సీమ కుష్వాహా.. ఈ పేరు ప్రస్తుతం యావత్ దేశం మొత్తం జపిస్తుంది. ఎందుకు సీమ అంత ప్రత్యేకం అనుకుంటున్నారా.. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఒకేసారి నలుగురు దోషులను ఉరికంబం ఎక్కించడం వెనక ఆమె అంతులేని పోరాటం ఉంది కాబట్టి.. నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడటానికి ఇద్దరు మహిళలు తమ శక్తిని అంత కూడబెట్టి చివరి వరకు నిలబడ్డారు. ఈ రోజు శిక్ష అమలు జరిగే వరకు ఈ ఇద్దరు చేసిన కృషి ఎంత చెప్పిన తక్కువే.. ఆ ఇద్దరిలో ఒకరు నిర్భయ తల్లి ఆశా దేవి మరొకరు ఈ కేసు వాదించిన లాయర్ సీమ కుష్వాహా..
ఏడేళ్లుగా కంటి మీద సరిగ్గా నిద్ర కూడా పోలేదు వీరిద్దరూ. ఇలాంటి ఎన్నో కేసులు జరుగుతున్నాయి కానీ సీమ ఎందుకు ప్రత్యేకం అంటే ఆమెకు ఇదే మొదటి కేసు కావడం.. సీమ ఈ కేసు తీసుకోవడానికి ముందు అఘాయిత్యం జరిగిన మహిళల తరపున వాదించే జ్యోతి అనే ఒక ట్రస్ట్ లో ఒక మెంబర్ మరియు ట్రైనీ లాయర్, అలాగే ఆమె ఐఏఎస్ కి ప్రిపేర్ కూడా అవుతుంది. ఇకపై ఒక్క ఆడకూతురికి కూడా ఎలాంటి అన్యాయం జరగకూడదని సీమ ఒక కృత నిశ్చయంతో అడుగు ముందుకు వేశారు. నక్కజిత్తులతో, రోజుకొక ఎత్తుతో, చట్టంలో ఉన్న లోపాలను వాడుకుంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన కరుడుగట్టిన క్రిమినల్ లాయర్ ఎపి సింగ్ అడ్డుగా నిలబడి న్యాయాన్ని రెండు చేతులతో అడ్డుపెట్టి కాపాడారు. అంతే కాదు ఏడేళ్ల పాటు ఎన్నో బెదిరింపులను కూడా ఆమె లెక్కచేయలేదు.
ఇక సీమ ఢిల్లీ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. ఈ ఘటన జరిగినపుడు ఆమె ఒక ట్రైనీ మాత్రమే. సాధారణంగా ట్రైనీ లాయర్ అంటే ఎవరు కేసును వాదించడానికి ముందుకు రారు పైగా ఇంత కంప్లికేటెడ్ కేసును వాదించడానికి ఎపి సింగ్ వాదిస్తున్నాడని తెలిసి అందరు వెనకడుగు వేసిన ఆమె మాత్రం భయపడలేదు. ఇక ఆశాదేవి పేదరికం గురించి తెలిసిన ఆమె ఫ్రీగానే ఇన్నేళ్ళపాటు వాదించారు. కింద కోర్ట్ నుడి హై కోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు ఆమె తన వాదనని కొనసాగించింది. అన్ని ఖర్చులు తానే భరించుకుంది. కోర్ట్ మారిన ప్రతి సారి కొత్త చిక్కులు ఎదురైనా, సీనియర్ లాయర్ల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగింది.
ఇక ఆ నలుగురి కథ ముగిసింది అని తెలిసిన వెంటనే ఆశాదేవి మొదటగా ధన్యవాదాలు తెలిపింది సీమకే. ఏడేళ్ల పోరాటానికి ఈ రోజు ముగింపు పడింది. దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఇలాంటి ఒక సంఘటనలో చివరికి న్యాయం గెలిచింది అంటూ ఆశాదేవి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సంతోషం వెనక సీమ కుష్వాహా కఠోర శ్రమ ఉంది అంటూ ఆమె కొనియాడింది. ఒక యువ లాయర్ న్యాయం కోసం ఇంత ఒంటరి పోరాటం చేస్తుంటే అనుభవం ఉన్న ఎపి సింగ్ లాంటి క్రిమినల్ లాయర్లు మాత్రం సీమ పై పలుమార్లు మాటల దాడి చేసారు. అయినా ఆమె తన పట్టుదల విడవలేదు. ఈ కుర్ర అమ్మాయి ఎం చేస్తుందిలే అనుకున్న వారికి ఇప్పటికి సమాధానం దొరికింది. ఇకనైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుందాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…