Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే.. అతడు షేర్ చేసిన వీడియోలో.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టికెట్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలతో జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఇక ఈ విషయంలో అర్జీవీకి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ సైతం మద్దతు పలకడం జరిగింది. సినిమా టికెట్స్ వ్యవహారంపై జగన్ సర్కారుకు సూటిగా 10 ప్రశ్నలు సంధించారు రామ్ గోపాల్ వర్మ. దీనికి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలుకుతూ ట్వీట్ చేసారు. ఇక నేపధ్యంలో అర్జీవీకి గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రి కొడాలి నాని.
సినిమా టికెట్ల విషయంలో రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. పక్క రాష్ట్రాలలో కూర్చొని, పక్క రాష్ట్రంలో సినిమాలు తీసుకుంటూ.. పక్క రాష్ట్రంలో జీవితాన్ని అనుభావిస్తున్నటువంటి వ్యక్తులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో కూర్చొని రామ్ గోపాల్ వర్మ ఏదైనా మాట్లాడతాడని, అటువంటి అర్జీవీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు మంత్రి కొడాలి నాని. సినిమా టికెట్ల విషయంలో మాకేం సంబంధం లేదని చెబుతున్నారు కదా అయితే వాళ్ళనే సినిమాలు తీసుకుని అమ్మేసుకోమని చెప్పండి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు తక్కువ రేటులో వినోదాన్ని అందించడం మా భాద్యత. మా టికెట్లు మేము ఎంతకి అమ్మలో నియంత్రించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ధిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కుండ బద్దలు కొట్టారు కొడాలి నాని.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…