కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేసినా కొందరు మాత్రం నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. నిత్యం జరుగున్న బైక్ యాక్సిడెంట్లలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా వాహనదారుల్లో మార్పు రాకపోవడంతో కోల్‌కతా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ వెళ్లే వాళ్లు పెట్రోల్ ను కొనుగోలు చేయలేరు. మరో రెండు రోజుల్లో కోల్ కతా అంతటా ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కోల్ కతా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలోని పెట్రోల్ బంకులకు హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించే వారికి పెట్రోల్ పోయకూడదని ఆదేశాలు జారీ చేశామని.. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని తెలిపారు.
టూ వీలర్ వాహనాలపై ప్రయాణించే వాళ్లలో బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక ఉండే వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అనూజ్ శర్మ వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం హెల్మెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టూ వీలర్లపై ప్రయాణించే వాళ్లు హెల్మెట్ ధరించాలని సూచనలు చేశారు.
ఎవరికైనా హెల్మెట్ కొనుగోలు చేసేంత స్థోమత లేకపోతే వారికి ప్రభుత్వమే ఉచితంగా హెల్మెట్ ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. సమీప పోలీస్ స్టేషన్ లో వివరాలు ఇచ్చి హెల్మెట్ ను పొందవచ్చని మమతా బెనర్జీ వెల్లడించారు. మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించమని.. అయితే మాస్క్ ధరించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నానని మమతా బెనర్జీ అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…