నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త చెప్పింది. 70 డిప్లొమా ఇంజనీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. https://ntpccareers.net/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఎన్టీపీసీ మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.
ఇంజనీరింగ్ లో డిప్లొమా పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగాల కోసం భర్తీ చేసుకోవచ్చు. 70 శాతం మార్కులతో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హత కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడు సంవత్సరాలు వయో సడలింపులు ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 23, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే మైనింగ్ విభాగంలో 40 ఉద్యోగాలు, ఎలక్ట్రికల్ విభాగంలో 12 ఉద్యోగాలు, మెకానికల్ విభాగంలో 10 ఉద్యోగాలు, మైన్ సర్వే విభాగంలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…