నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త చెప్పింది. 70 డిప్లొమా ఇంజనీర్‌‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. https://ntpccareers.net/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఎన్టీపీసీ మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.

ఇంజనీరింగ్ లో డిప్లొమా పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగాల కోసం భర్తీ చేసుకోవచ్చు. 70 శాతం మార్కులతో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హత కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడు సంవత్సరాలు వయో సడలింపులు ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 23, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఉద్యోగ ఖాళీలను పరిశీలిస్తే మైనింగ్ విభాగంలో 40 ఉద్యోగాలు, ఎలక్ట్రికల్ విభాగంలో 12 ఉద్యోగాలు, మెకానికల్ విభాగంలో 10 ఉద్యోగాలు, మైన్ సర్వే విభాగంలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here