Featured

Manjima Mohan: గౌతమ్‌తో పెళ్లిపై స్పష్టతనిచ్చిన కోలీవుడ్‌ భామ!

Manjima Mohan: తమిళ సినిమా పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్‌లు ప్రేమలో ఉన్నారంటూ గతకొంత కాలం నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరి పెళ్లికి పెద్దలు కూడా ఓకే చెప్పేశారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై వారిద్దరిలో ఏ ఒక్కరూ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. అయితే ఈ మధ్య మంజిమా పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తన ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ హీరో గౌతమ్ కార్తిక్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో వారిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమేనని చాలా మంది భావించారు.

Manjima Mohan: గౌతమ్‌తో పెళ్లిపై స్పష్టతనిచ్చిన కోలీవుడ్‌ భామ!

మంజిమాను ముద్దుగా మోమో అని పిలిచుకునే గౌతమ్, ‘మాంజిమా లాంటి అద్భుతమైన, శక్తిమంతమైన వ్యక్తి తన జీవితంలో ఉండటం గొప్పగా భావిస్తాను. హ్యాపీ బర్త్ డే మోమో’ అని పోస్ట్‌ పెట్టడంతో కోలీవుడ్‌ల్‌ ఈ వార్త సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా తమ రిలేషన్‌పై వస్తోన్న వార్తలపై నోరు విప్పారు మంజిమ. ఆ వార్తలన్నీ అబద్ధమేనని ఆమె కొట్టి పారేసింది. గౌతమ్‌తో పెళ్లి అంటూ వచ్చి వార్తలు చూసి తాను నిజంగా షాకవడంతో పాటు, చాలా భయపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.. ఈ వార్తలపై తన తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవతారోనని భయపడ్డాను , కానీ వారు ఈ పుకార్లను అంతగా పట్టించుకోలేదని ఆమె అన్నారు.

Manjima Mohan: గౌతమ్‌తో పెళ్లిపై స్పష్టతనిచ్చిన కోలీవుడ్‌ భామ!

తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం లేదన్న ఆమె, నిజంగా ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తాను’ అంటూ మంజిమా స్పష్టం చేశారు.కాగా తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమాలో ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చినట్టు సమాచారం.

మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డ్…

ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా విష్ణు విశాల్‌ ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ఇక అభినందన, అన్వేషణ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తిక్‌ వారసుడే. కాదల్‌ (తెలుగులో కడలి) తో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి ‘దేవరట్టం’ అనే చిత్రంలో నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago