Featured

Jr NTR: నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి: ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రచార వ్యూహాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం 5 రోజుల్లో భారతదేశంలోని 9 నగరాలను చుట్టిరానుంది.

Jr NTR: నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి: ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్!

ఇక భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటకలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తో పాటు, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కాగా పునీత్ సర్ ఇక్కడ లేరు అని తానెప్పుడూ అనుకోనని, ఎందుకంటే పునీత్ అంటేనే సెలబ్రేషన్ అని, కాబట్టి ఆయన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూనే ఉందాం అని ఆయన్ని గుర్తు చేసుకుంటూ హార్ట్ టచింగ్ వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్. అంతే కాకుండా ఆయన లేరు అని ఎవరూ ఏడవద్దు, ఆయనేపుడూ మనతోనే ఉంటారని ఎన్టీఆర్ అన్నారు.

Jr NTR: నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి: ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్!

ఇకపోతే ఆర్ఆర్ఆర్ అనేది సినిమా మాత్రమే కాదని, అది తనకు, చరణ్ కు మధ్య ఉన్న బంధం అని ఎన్టీఆర్ తెలిపారు. భారతీయ సినిమా గొప్పదనాన్ని తెలియజేయాలని కలగనే ఓ దర్శకుడి కథే ఈ చిత్రం అని ఆయన స్పష్టం చేశారు. ఈ మూవీలో తాను కూడా ఓ చిన్న పాత్ర చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

మన బంధానికి దిష్టి తగలకూడదు…

ఇక ఈ సినిమాలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్క ఒక్కరికీ థాంక్స్ అని ఎన్టీఆర్ తెలిపారు. దీంతో పాటు చరణ్‌తో ఈ బంధం ఎప్పుడూ ఇలానే ఉండాలని, తమ సాన్నిహిత్యం, ఫ్రెండ్ షిప్‌ కు దిష్టి తగలకుండా ఉండాలని, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చరణ్ ను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నారు? ట్యాబ్లెట్లు వేసుకునే సరైన పద్ధతి తెలుసా? మందులు తీసుకునే టైమ్ ఎందుకు ముఖ్యం?

మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్‌ను నోట్లో వేసుకుని నీళ్లు…

2 hours ago

వార్ట్స్‌తో ఇబ్బందా? ఇంట్లోనే సింపుల్ పరిష్కారాలు!

చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…

3 hours ago

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…

3 hours ago

ఐఎన్‌సీఏ అవార్డుల్లో తెలుగు సినిమాల జోరు.. నాగ చైతన్య, బుల్లిరాజులకు అవార్డులు!

ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…

3 hours ago

పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. కటకటాల్లోకి కమెడియన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…

3 hours ago

విడాకుల తర్వాత కొత్త జీవితం.. హన్సిక భావోద్వేగ వ్యాఖ్యలు..!

తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన…

3 hours ago