ఎస్వీ కృష్ణారెడ్డిగా పిలువబడే సత్తి వెంకటకృష్ణారెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు.దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలుచిత్రాలు విజయవంతమయ్యాయి.
ఎస్.వి.కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు. కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు. మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో “పగడాల పడవ” అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతను సినిమాలలో రాణించాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు.
1991మనిషా ఫిలిమ్స్, కె అచ్చిరెడ్డి నిర్మాణం, కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో “కొబ్బరి బొండం” విడుదలైంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, నిరోషా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి కథ, సంగీతం సమకూర్చారు. దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేకున్నా ఆ తర్వాత మనిషా ఫిలిమ్స్ తమ సొంత బ్యానర్ లో ఎస్.వి.కృష్ణారెడ్డికి “రాజేంద్రుడు-గజేంద్రుడు” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించింది.
ఆ తర్వాత “మాయలోడు” చిత్రానికి దర్శకత్వం వహిస్తూ… షూటింగ్ గ్యాప్ లో సూపర్ స్టార్ కృష్ణకి కథలోని ఓ సీన్ చెప్పారు. హీరో కృష్ణ ఆ సీన్ బాగుంది చేద్దామని చెప్పారు. మిగతా కథ సిద్ధం చేసుకొని.. 1994 మనీషా ఫిలిమ్స్, కె.అచ్చిరెడ్డి నిర్మాణం, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘నెంబర్ వన్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీత సారధ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని ఐదు పాటలు మంచి విజయాన్ని పొందాయి. ముఖ్యంగా “కోలో..కోలో కోయిలమ్మ కొండ కోన బుల్లెమ్మ” అనే పాటలో సూపర్ స్టార్ కృష్ణ వివిధ రకాలైన గెటప్ లో కనిపించడం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.
అయితే 1990 దశకంలో హీరో కృష్ణ చిత్రాలు తగ్గిపోయినా కూడా “నెంబర్ వన్” టైటిల్ పెట్టడం ఏంటి అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. ప్రతి ఇంట్లో కుటుంబ బాధ్యతలను తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. “నెంబర్ వన్” చిత్రంలో తల్లి, తండ్రి చనిపోగా కుటుంబ బాధ్యతలను హీరో భుజాన వేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు. కావున ఈ చిత్రానికి హీరో కృష్ణ నెంబర్ వన్ అని చెప్పడంతో కాంట్రవర్సీ సద్దుమణిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…