Movie News

అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన హీరో.. ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. క్రిమినల్ కేసులు కూడా!

దేశంలో మే 2వ తేదీ పలు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గెలుపొందారు. ఈ క్రమంలోనే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌  చెపాక్  – తిరువళ్లికేని నియోజకవర్గం  నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న ఉదయనిది స్టాలిన్ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా,పీఎంకే అభ్యర్థి AVK కాసల్లిపై దాదాపు 69,355 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.

ఈ నియోజకవర్గం నుంచి ఇంత మెజార్టీతో గెలుపొంది తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నాడు. గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి స్టాలిన్ తాతగారు దివంగత కరుణానిధి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఉదయనిది తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచాడు.

ఉదయనిధి స్టాలిన్ స్థిర, చరాస్థులు అన్ని కలిపి రూ. 33 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. 2019 -20 యేడాదిగాను రూ. 4.89 లక్షల ఆదాయం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన భార్య కిరుతిగ పేరుపై రూ. 1.15 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు.చరాస్తుల విషయానికొస్తే.. రూ. 21.13 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. భార్య కిరుతిగ పేరు మీద రూ. 1 కోటి 15 లక్షల చరాస్థులు ఉన్నాయి.  ఇద్దరు పిల్లల మీద రూ. 25 లక్షల చరాస్థులు ఉన్నట్టు తెలియజేశారు.

స్టాలిన్ స్థిరచరాస్తులు ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విధంగా పేర్కొన్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఇతని ఆస్తులు 100 కోట్లపైనే ఉన్నట్లు సమాచారం. స్టాలిన్ స్థిరచరాస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో అదేవిధంగా అతనిపై 22 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు.సైదా పేట్, కల్లకురిచి, గిండి, నుంగంబాకం, తిరుక్కువేలాయై, నాగపట్నం, కుతలం పోలీస్ స్టేషన్ లలో ఇతని పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేసిన సమయాలలో నమోదైనవని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago