Featured

Kona Venkat : పూరి జగన్నాథ్ కి స్పీడ్ ఎక్కువ, అదే అన్ని ప్రమాదాలకి కారణం : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీ లో కోన వెంకట్ కు మొదటి నుండి ఆర్జివి తో అనుబంధం ఉంది, ఆ తరువాత పూరి జగన్నాథ్ తో స్నేహం ఉంది. ఇక పూరి ఈ మధ్య బాగా ఫ్లాప్స్ చూస్తున్న తరుణంలో కోన, పూరి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసాడు.

జగన్ కి స్పీడ్ ఎక్కువ…

పూరి జగన్నాథ్ తో పరిచయం ఎప్పటి నుండో ఉన్నా కలిసి పనిచేసింది ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ సినిమా కోసమే అంటూ కోన చెప్పారు. పూరి స్వతహాగా రైటర్ కావడం వల్ల తన సినిమా కథ తానే రాసుకుంటాడు. అలానే డైలాగులు రాసుకుంటాడు. అయితే పూరి ఎందుకనో కొంచెం పంథా మార్చాలి అనుకున్నపుడు నా లాంటి రైటర్ కి అవకాశం ఇస్తాడు అలా అమ్మ నాన్న తమిళ అమ్మయి సినిమాలో పనిచేశాము.

ఇక మళ్ళీ ‘ఆంధ్రావాలా’ లో కలిసి పనిచేసాము. అయితే పూరికి అవసరం లేదు రైటర్ తో కాకపోతే తనకు స్క్రీన్ ప్లే విషయంలో ఒకరు అవసరం అని నా అభిప్రాయం. ఎందుకంటే తాను చాలా స్పీడ్ గా పని చేస్తాడు. వేగం ఎప్పుడైనా ప్రమాదమే, తప్పులు జరుగుతాయి. అందుకే తన సినిమా విషయంలో తప్పులు జరుగుతున్నాయి. అదే స్క్రీన్ ప్లే దగ్గర ఎవరైనా సహాయం చేస్తే తప్పులు జరగవని నా అభిప్రాయం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago