Konda Surekha : కొండా సురేఖ, కొండా మురళి జీవిత కథను రామ్ గోపాల్ వర్మ కొండా సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదల సందర్బంగా కొండా సురేఖ, మురళి గారు చాలా ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు వారి లైఫ్ జర్నీ గురించి చెబుతూ వస్తున్నారు. అలానే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సురేఖ మురళి గారి వివాహానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు.
ఆ విషయంలో మమ్మల్ని డిసోపాయింట్ చేసారు…
పరకాల నియోజకవర్గంలో కొండా దంపతులు ఫేమస్. ఇక వారు ఇద్దరూ రాజకీయంగా ఎదిగిన తీరు, చాలా మందికి తెలుసు. ఇక చాలా మందికి వాళ్ళ పెళ్లి గురించి మాత్రం తెలియదు. కొండా సురేఖ గారు వాళ్ళ వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొండా సురేఖ కాలేజీలో చదివేటప్పుడు కొండా మురళి గారు ఆమెకు సీనియర్. ఇక రోజూ కాలేజీ దగ్గర ఫాలో అవుతూ ఉంటే ఎవరిని ఫాలో అవుతున్నారో తెలిసేది కాదట. కొన్నాళ్ళు గడిచాక ఇంటి వరకూ ఫాలో అవ్వడంతో తనను ఫాలో అవుతున్నట్లు అర్థమైందట సురేఖ గారికి. ఇక ఒకరోజు ఉదయాన్నే బస్సు స్టాప్ దగ్గర నిలబడి ఉంటే వచ్చి ఫోన్ నెంబర్ రాసుకోమని చెప్పి వెళ్లి పోయారట మురళి.
ఇక మళ్ళీ కొన్నిరోజుల తరువాత కనిపించక పోయేసరికి ఫోన్ చేస్తే అది మురళి వాళ్ళ మిల్ నెంబర్ కావడంతో మిల్ లో పనిచేసే వ్యక్తి ఫోన్ ఎత్తి మురళి గారు లేరని చెప్పారట. ఇక మళ్ళీ కొన్ని రోజుల తరువాత టెన్నిస్ ఆడటానికి స్టేడియం వెళ్లిన సురేఖను కలిసి మురళి పెళ్లి చేసుకుందాం అని అడిగారట. ఇక ఇంట్లో ఒప్పుకుంటారా అనే సంధిగ్ధం నడుమ చివరికి తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నారట. అయితే ఈ విషయాలను ఆర్జీవి చక్కగా చూపలేదని, మా లవ్ స్టోరీ ని ఫెయిల్ చేసాడని సురేఖ అన్నారు. ఆ విషయంలో మాత్రం బాగా నిరాశ చెందామని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…