Konda Surekha : కొండా దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా ఆర్జీవి తీసిన ‘కొండా’ సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఆ సినిమా విడుదల తరువాత పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకుంటున్నారు కొండా సురేఖ. ఇక సినిమాలో చూపించిన దానికంటే ఎక్కువ సంఘర్షణలు నిజ జీవితంలో తాము ఎదుర్కొన్నట్లు కొండా సురేఖ తెలిపారు. ఇక వారి ప్రేమ పెళ్లి గురించి ఆర్జీవి ఎక్కువ చూపలేదని ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉందని వాఖ్యణించారు. ఇక కూతురు సుస్మిత పటేల్ చాలా కష్టాలు పడిందని చిన్న వయసులోనే చాలా చూసిందని అందుకే తాను చాలా గట్టిపడిందని వాఖ్యణించారు సురేఖ.
మురళి ఎన్ కౌంటర్ విషయంలో చంద్రబాబు ఏమన్నారంటే…
ఇక పరకాలలో కొండా కు ప్రత్యర్థి, అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వర్గ విభేదాలు ఉండేవి. ఇక రాజకీయంగా కూడా వైరం ఉంది ఈ ఇరువర్గాల నడుమ. ఇక కొండా మురళిని టీడీపీ హయాంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా వేధించారంటూ సురేఖ చెప్పారు. ఒకానొక సందర్భంలో కొండా మురళిని ఎదుర్కొనడం కోసం ఎన్ కౌంటర్ చేయించమని చంద్రబాబు నాయుడు గారిని అడిగాడట. అయితే చంద్రబాబు నాయుడు దయాకర్ రావును మందలించారట. అలా ఎలా ఎన్ కౌంటర్ చేస్తారు, రాజకీయంగా సురేఖ ఎమ్మెల్యే గా ఉన్నారు, అందరికీ ఏం సమాధానం చెబుతాము, ఇలాంటి ఆలోచన వద్దు అంటూ హెచ్చరించారట.
అలా మురళి గారికి బాగా అపాయం ఉండేదని చంపాలి అని చాలా సార్లు మా బండి వెనుక రావడం, రెక్కి నిర్వహించడం జరిగాయాని, ఇంకా రాజకీయంగా అంత ప్రాబల్యం లేని సమయంలో ఎర్రబెల్లి బాగా వేధించారని ఇప్పుడు కూడా రాజకీయంగా మా ఎదుగుదలను ఓర్వలేక మొన్న కొండా సినిమా వేడుకకు రావాల్సిన రేవంత్ రెడ్డి ని రాకుండా అడ్డుకున్నాడని చెప్పారు కొండా సురేఖ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…