Categories: FeaturedGeneral News

PV Sindhu : రీమిక్స్ పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన పీవీ సింధు… మీకు సంతోషాన్నిచ్చేది చేయాలి అంటూ పోస్ట్…!

PV Sindhu : తెలుగమ్మాయి పూసర్ల వేంకట సింధు తెలియని భారతీయుడు ఉండడు. బాడ్మింటన్ లో ఇండియా పేరుని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టిన సింధు అందరికీ సుపరిచితమే. హైదరాబాద్ కు చెందిన పీవీ సింధు బాడ్మింటన్ లో అప్పటి వరకూ ఎవరూ సాధించని ఘనత సాధించింది. ఒలింపిక్స్ ఫైనల్స్ కు వెళ్లడమే రికార్డు అనుకుంటే వెళ్లి మొదటి సారి బ్రాంజ్ మెడల్ అందుకుంది. ఇక ఆతరువాత సిల్వర్ మెడల్ అందుకుంది. ఇక అనేక ఛాంపియన్ షిప్ లలో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ సింధు అతిచిన్న వయసులో ఈ ఘనతలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది.

స్టెప్పులేసి అదరగొట్టిన సింధు వీడియో వైరల్…

పీవీ సింధు అటు బాడ్మింటన్ లోనే కాదు తనకు డాన్స్ చెయ్యటం చాలా ఇష్టం. అందుకే అప్పుడపుడు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే బాదాం బాదాం కచ్చా బాదాం అంటూ స్టెప్పులేసిన పీవీ సింధు ఇపుడు మరో రీమిక్స్ పాటకు డాన్స్ చేసి ఆశ్చర్య పరిచింది. అంతేకాక వీడియో కి కింద ‘మీకు ఏది సంతోషాన్నిస్తుందో అది చేయాలి’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది. ట్రెండింగ్ లో ఉన్న రెండు రీమిక్స్ పాటలకు స్టెప్పులేసింది సింధు. బాడ్మింటన్ కోర్టులో పులిలా ఆడే సింధు నాజుకుగా డాన్సులు కూడా ఆదరగోడుతోంది.

ఇక నెటిజన్స్ డాన్స్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే సింధు ఈ వీడియోని అభిమానులతో పంచుకోగానే లక్షల్లో వ్యూస్ మరియు లైక్స్ అందుకుంది. మరి సినిమా వాళ్లకు ఏమాత్రం ఫాలోయింగ్ లో తీసిపోవడంలేదు ఈ బాడ్మింటన్ స్టార్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago