Featured

Kongara Jaggayya : భారత రాజకీయాల్లో మొదటి ఎంపీ అయిన సినీ నటుడు… ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాలు ఏలిన తెలుగు నటుడు…!

Kongara Jaggayya : కేవలం హీరో పాత్రలకే పరిమితమవ్వకుండా, విలన్ పాత్రలతోను మెప్పించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన గాత్రం ఇంకా ఫేమస్, కంచు కంఠం అనే బిరుదు కూడా తెచ్చుకున్న ఆ అలనాటి నటులు కొంగర జగ్గయ్య గారు సినిమా నటుడుగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయన ఇండియాలోనే మొదటిసారిగా సినిమా నటుడు లోక్ సభ కు ఎంపీ అయ్యారని చాలా మందికి తెలియదు.

ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లో తెలుగు నటుడు…

అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయ చైతన్యం తెచ్చారు. ఆయన పార్టీ పెట్టి చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయంగా కూడా అడుగులేశారు. ఇక ఈవిషయం అందరికీ తెలిసిందే కానీ రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లలో మొదటి వాడు మాత్రం ఎన్టీఆర్ కాదు. అసలు ఇండియన్ సినిమా నటులలోనే మొదటి సారి రాజకీయ ప్రవేశం చేసి ఎంపీ గా, అదికూడా భారీ మెజారిటీ తో గెలిచిన వ్యక్తి కొంగర జగ్గయ్య గారు. ఆయన సొంతూరు తెనాలి, మరో ఆశ్చర్యకర విషయం ఎన్టీఆర్, జగ్గయ్య ఇద్దరూ ఒకే కాలేజీ లో చదివారు. జగ్గయ్య గారు ఎన్టీఆర్ కు సీనియర్, ఆయనతో కాలేజీ అప్పుడే పరిచయం ఉంది. ఇక జగ్గయ్య గారు 1967 లో ఒంగోలు పార్లమెంట్ సీటు కి పోటీ చేసి 80 వేలకు పైగా మెజారిటీ తో గెలుపొందారు.

జగ్గయ్య గారు మొదట జయ ప్రకాష్ గారి ప్రజా సోషలిస్ట్ పార్టీ లో కాలేజీ రోజుల్లోనే చేరినా, ఆ తరువాత 1956 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి 1967 లో లోక్ సభ ఎంపీ అయ్యారు. అలా మొదటి సినిమా వ్యక్తి ఇండియన్ పొలిటికల్ లోకి వచ్చారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతే కాక జగ్గయ్య గారు రవీంద్ర నాథ్ ఠాగూర్ రచనలను రవీంద్ర గీత పేరుతో తెలుగులోకి అనువదించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago