Movie News

నమస్కారం చెప్పినందుకు బాలయ్య నా మొహం పై ఉమ్మేశాడు.. కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ఆదరణ దక్కించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావు నటనపై ఆసక్తి ఉండటం చేత పలు నాటకాలు వేస్తూ మెల్లిమెల్లిగా సినిమా ఇండస్ట్రీ వైపు పయనించారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదిగిన కోట శ్రీనివాస్ రావు ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు.గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైన కోట శ్రీనివాసరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా తెలియజేశారు.

నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాత్రలో ఓ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ ను కించపరిచే విధంగా ఉండటం చేత అప్పట్లో ఈ సినిమా పెద్ద వివాదానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సీఎం అయినప్పటికీ అతనికి వివరణ ఇవ్వడం కోసం అతనిని కలవాలని వెళ్లాను.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అతనిని కలవడానికి వెళ్లగా అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. తనకు వివరణ ఇవ్వడానికి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ నన్ను కొట్టినా పర్వాలేదని అక్కడికి వెళ్లాననీ ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఓ సారి లిఫ్ట్ దగ్గర బాలకృష్ణ తనకు ఎదురుకావడంతో బాలకృష్ణకు నమస్కారం పెట్టాను. ఈ విధంగా నమస్కారం పెట్టడంతో బాలకృష్ణ కాండ్రించి మొహం పై ఉమ్మేసారు. అయితే అప్పుడు అతను ఒక సీఎం కొడుకు, తన తండ్రి గురించి ఆ విధంగా సినిమా తీస్తే కోపం ఉంటుందని భావించి అక్కడి నుంచి వెళ్లాను. అయితే ఆ తర్వాత ఎన్నో సార్లు గొడవలు జరిగాయని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago