మెగాస్టార్ చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే “ఖైదీ నెంబర్ 150” చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తరువాత “సైరా నరసింహారెడ్డి” ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం చిరంజీవి తన 153 వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ నటించబోయే 154 వ చిత్రానికి సంబంధించి తాజా ప్రకటన తెలియజేశారు.
మెగాస్టార్ తన 154వ చిత్రంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో “వేదాళం” సినిమాకు రీమేక్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను చిత్రబృందం తెలియజేశారు. ఈ సందర్భంగా ఈసినిమాకు “భోళాశంకర్”అనే టైటిల్ ను ఖరారు చేసారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసారు. మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన టువంటి “వేదాళం” సినిమా ఎంతో విజయవంతమైంది. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం మెగాస్టార్ కి వచ్చింది.
వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న “భోళాశంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్ర ఎంతో కీలకమైనదని, ఈ కీలక పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుందనే సమాచారం వినబడుతుంది. మొత్తానికి మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా తన 154 వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని తెలియజేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…