సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వేసే పాత్రలను ఎన్నటికీ మర్చిపోలేము. అయితే ఈ కోవలోకి వస్తుంది అలనాటి నటుల్లో ఒకరైన నటి సితార. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె ఒకప్పుడు హీరోయిన్ అయినప్పటికీ ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. అమ్మ పాత్రలో, వదిన పాత్రలో ఎవరైనా చేయాలని అనిపిస్తే దర్శకులకు వెంటనే గుర్తుకువచ్చే పేరు సితార. అంతలా ఆమె నటనలో ఒదిగిపోతారు.
ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె కేరళలో జన్మించారు. ఆమె కాలేజీలో చదువుకుంటూనే సినిమాల్లోకి ప్రవేశించింది. ఆమెది మళయాలం అయినప్పటికీ కన్నడ ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. కన్నడలోనే హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే కన్నడ స్టార్ యాక్టర్ మరియు నిర్మాత అయిన మురళి మరణం అనేది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఆమె చెప్పుకొచ్చింది.
1982లో నటుడిగా ప్రవేశించిన మురళి 2010 వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా సితార, రంభ, రోజా, సిమ్రాన్, మీనా వంటి స్టార్ హీరోయిన్లతో కూడా ఆయన నటించారు. తమిళ, కన్నడ, తెలుగులో అతడికి మంచి గుర్తిపు కూడా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ 40వ ఏటా అతడు హఠాత్తుగా మరణించడం.. ఆమెను ఎంతగానో బాధించిందని చెప్పారు.
సితారకు ప్రస్తుతం 48 సంవత్సరాలు. అయితే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. దీనికి కారణం కూడా ఆమె చెప్పారు. తన నాన్న అంటే సితారాకు చాలా ఇష్టం. ఆమె చేసే ప్రతీ పనిలో ఆయన్నే సలహాలు అడిగేదట. వాళ్ల నాన్న కూడా హఠాత్తుగా మరణించడంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. దాని తర్వాతనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని ఆమె చెప్పింది. ఆమె 1990లో మససు మమతా సినిమాతో సితార తెలుగులోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…