మోహన్ బాబు వారసులుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్, విష్ణులు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇందులో “మేజర్ చంద్రకాంత్” సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో బాలనటుడిగా నటించిన మంచు మనోజ్ “దొంగ దొంగది” సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. తర్వాత బిందాస్, వేదం, కరెంట్ తీగ, పోటుగాడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకొని అభిమానులను ఇంకాస్త పెంచుకున్నారు.
ఇటీవల కాలంలో మనోజ్ పరిమితంగానే సనిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మి అనే సినిమా తెరకెక్కుతోంది. దీనిపై అతడి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. తాజాగా అతడు తన సోదరి మంచు లక్ష్మితో కలిసి తిరుమల తిరుపతిని దర్శించుకున్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో వెంచర్స్ లను ప్రారంభించనున్నామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా మనోజ్ అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే అతడు సినిమాల్లో నటిస్తారా.. లేదా వ్యాపారాలకే పూర్తిగా పరిమితమవుతారా.. అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలకు మంచు మనోజ్ చెక్ పెడుతూ.. ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు.. తన గురించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయొద్దని.. ఆ న్యూస్ ను ఖండిస్తున్నట్లు ట్విట్టర్ లో ఆ న్యూస్ ను ట్యాగ్ చేస్తూ స్పందించారు. ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరో వైపు బిజినెస్ లు స్టార్ట్ చేసిన వారు ఎందరో ఉన్నారు. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ నటీనటుల బిజినెస్ కు హెల్ప్ అవుతోంది. ఈ రకంగానే మనోజ్ సినిమాలకు దూరం అవుతున్నారనే వార్తకు అతడు చెక్ పెట్టేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…