Categories: FeaturedMovie News

Kota Srinivasarao : చిరంజీవి చాలా సార్లు కోపడ్డారు… కారణం అదే : కోట శ్రీనివాసరావు

Kota Srinivasarao : విలనిజంలో కొత్త స్టైల్ చూపిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన కమెడియన్ గాను విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కోటా గారు సినిమాల్లోకి వచ్చేకన్నా ముందే బ్యాంకు లో ఉద్యోగిగా ఉండేవారు. కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ రెండింటి మీద ప్రయాణం చేసారు. ఇక సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాక ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో నటించారు. అలా సౌత్ భాషలలో నటించిన ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాల్లో నటించడం లేదు. అయితే పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు ఆయన సినిమా కెరీర్ విశేషాలను చెబుతుంటారు.

చిరంజీవి చాలా సార్లు తిట్టాడు…

కోటా గారు ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల చాలా సార్లు ఇబ్బందులు కూడా పడ్డాడు. అయితే ఆయనకు ఏ నాడూ సినిమా అవకాశాలు తగ్గలేదు. అయితే ఆయన బాగా డ్రింక్ చేస్తారనే ప్రచారం ఉంది. ఇక ఇదే విషయం గురించి ఆయన మాట్లాడుతూ షూటింగ్ కి ఏ రోజూ తాగి రాలేదని కేవలం బయట మాత్రమే తాగుతానని చెప్పారు.

ఈ విషయంలో చాలా సార్లు చిరంజీవి నన్ను తిట్టేవాడని కోటా చెప్పారు. నువ్వో మంచి ఆర్టియట్ వి ఇలా తాగి ఆరోగ్యం పాడుచేసుకోకు జాగ్రత్త అని చిరంజీవి చెప్పేవారట. ఆయన నా బాగుకోసమే అలా కోప్పడ్డారు. చిరంజీవి కి నా మీద చాలా అభిమానం, నా కొడుకు చనిపోయినపుడు కూడా వచ్చి చాలా బాధపడ్డాడు అంటూ కోటా గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago