Categories: FeaturedMovie News

Balakrishna: బాలయ్య ఫస్ట్ క్రష్ పేరు ఆశానా.. కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న బాలయ్య స్నేహితులు!

Balakrishna: బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇలా ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి బాలకృష్ణ మొదటి సీజన్ ఎంతో సక్సెస్ అయ్యారు ఇక రెండవ సీజన్లో భాగంగా ఈ కార్యక్రమంలో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ స్నేహితుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈయనతో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి నటి రాధిక కూడా హాజరయ్యారు. వీరీతో కలిసి బాలకృష్ణ వారి కాలేజీ విషయాలను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వుకున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ కూడా చివరిలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ విధంగా బాలకృష్ణ కామన్ ఫ్రెండ్స్ లో ఒకరు ఆశ గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఎందుకు గుర్తులేదు …ఆంధ్ర అసోసియేష‌న్ ఆఫ్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్ప‌ట‌ల్ అని చెప్పగా… అత‌డు బాల‌య్య ఇన్సిట్యూష‌న్ గురించిచెబుతున్నాడు కానీ ఆశ అనే అమ్మాయి గురించి తెలుసా అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా బాలకృష్ణ తన స్నేహితుడి నోరు మూసి పెట్టారు.

Balakrishna : సీఎం అవుతారని అస్సలు ఊహించలేదు…

ఈ విధంగా వీరి మధ్య జరిగిన సంభాషణ చూస్తుంటే ఆశ అనే అమ్మాయి బాలకృష్ణకు క్లాస్ మెట్ అని స్పష్టంగా అర్థం అవుతుంది అదేవిధంగా ఆమె తన ఫస్ట్ క్రష్ అని కూడా అర్థమవుతుంది.బాలకృష్ణ ఇప్పుడు తన స్నేహితుడు నోరు మూసేసిన భవిష్యత్తులో ఎప్పుడైనా ఆశ గురించి తప్పకుండా ప్రస్తావిస్తారంటూ భావించారు. బాలకృష్ణ ఈ కార్యక్రమంలో భాగంగా మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాత్ర అత్యంత సంక్రిష్టమైనదంటూ సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసలు బాలకృష్ణ హీరో అవుతాడని అనుకోలేదు అంటూ చెప్పగా వెంటనే బాలయ్య మీరు కూడా సీఎం అవుతారని నేను ఊహించలేదు అంటూ తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎంతో సరదాగా గడిచిపోయిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago