Kovai Sarala: తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కోవే సరళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటుడు బ్రహ్మానందంతో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన నటన కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.
ఇకపోతే గత కొంతకాలంగా ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు రాక దూరంగా లేరని ఈమె ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలలో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో కోవే సరళ నటిస్తున్న చిత్రం సెంబి. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ లో భాగంగా కోవే సరళగుర్తుపట్టలేనంత స్థితిలోకి మారిపోయారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర డిమాండ్ చేయడంతో ఈమె డి గ్లామర్ గా కనిపించడానికి కూడా సిద్ధమయ్యారు. ఇలా పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారని చెప్పాలి. ట్రైలర్ లో భాగంగా బడుగు బలహీన వర్గాల ప్రేక్షకులను ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎలా ఉపయోగించుకుంటారనే నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ లో కోవై సరళ తన మనవరాలుతో మాట్లాడుతూ ఓట్లు వేస్తే మంచి డాక్టర్లు అవ్వరు… మంచిగా చదువుకుంటేనే డాక్టర్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…