Nagarjuna: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి ఆలోచించి ఎన్నో పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే రైతుల క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలలో రైతు బంధు పథకం ఒకటి.ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుల అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులను జమ చేస్తూ ఉన్నారు. ఇలా రైతు బంధు పథకం ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన రైతుబంధు పథకం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారి అనుకూరి మురళి ఈ పథకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రైతుల కోసం తీసుకు వచ్చినటువంటి రైతుబంధు పథకం కేవలం రైతులకు మాత్రమే కాకుండా సంపన్నులు కూడా ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారని ఈయన తెలిపారు.
ఈ క్రమంలోని హీరో అక్కినేని నాగార్జునకు కూడా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని ఈయన ఆరోపించారు. ఈయన సినిమా హీరోగా మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఎన్నో బిజినెస్ లు, వందల ఎకరాలు ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో కూడా ఉంది.ఇలా వందల ఎకరాలు ఉన్నటువంటి నాగార్జున కూడా రైతు బంధు పథకానికి అర్హుడు అంటూ ఈయన ఈ పథకం పై విమర్శలు కురిపించారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో స్థిరపడిన వారికి తెలంగాణలో వందల ఎకరాలు భూములు ఉన్నవారు కూడా ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారని ఈయన వెల్లడించారు. వ్యవసాయం చేయని ఎమ్మెల్యేలు మంత్రులు సంపన్నులు సైతం ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారంటూ ఈయన తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…