Chandra Mohan : చంద్రమోహన్… తెలుగు సినిమా చరిత్రలో ఈయన తెలియని వారంటూ ఉండరు అని చెప్పవచ్చు. దీనికి కారణం ఆయన నటించిన విలక్షణమైన పాత్రలు. 1966 సంవత్సరం లో రంగులరాట్నం సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఇక అక్కడి నుంచి నాయకుడిగా, సహ నాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన పోషించారు. ఇందులో ఎక్కువగా కామెడీ పాత్రలకు చంద్రమోహన్ ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండి పోతారు. అయితే ఆనాటి కాలంలో కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ ని పేర్కొంటారు. అప్పట్లో సిరి సిరి మువ్వ లో జయప్రద తో, పదహారేళ్ళ వయసు సినిమా లో శ్రీదేవి తో ఈయన నటించిన తర్వాత వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. నిజానికి ఈయన ఇంకొక అడుగు ఎత్తు ఉంటే మాత్రం కచ్చితంగా స్టార్ హీరో అయి ఉండేవారు అని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇక ఈయన కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మే 23,1942 వ సంవత్సరంలో జన్మించారు. ఈయన బాపట్ల లోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి కొద్ది సంవత్సరాల పాటు ఏలూరులో పనిచేశారు. ఇక ఆ తర్వాత సినిమాల్లో నటించాలన్న కోరికతో ఆయన మద్రాసు చేరి సినిమాల్లో ప్రయత్నం చేసి హీరోగా తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు. చంద్రమోహన్ నటించిన సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి మొదలగు సినిమాలు అప్పట్లో భారీ విజయాన్ని సాధించాయి.
నిజానికి అలాంటి సమయంలో అప్పుడు హీరోలుగా కొనసాగుతున్న సూపర్ స్టార్ కృష్ణ, ఆడవారికి బాగా ఇష్టమైన హీరో శోభన్ బాబు కూడా చంద్రమోహన్ టాలెంట్ చూసి భయపడ్డారు అంటే నిజంగా అతిశయోక్తి కాదు కదా. ఈయన తో నటించిన కొందరు కొత్త కథానాయకులు అప్పట్లో సినీ ఇండస్ట్రీల అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇక ఆ లిస్టులో అందాల తార శ్రీదేవి, మంజుల, రాధిక, జయసుధ, జయప్రద, విజయశాంతి, తాళ్లూరి రామేశ్వరి, ప్రభా… ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ హీరోయిన్లందరూ ఆయనతో నటించిన వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. ఈయన భార్య పేరు జలంధర. ఈవిడ మంచి రచయిత్రి కూడా. ఈయన నటించిన ” సీత కథ ” చిత్రంతో గీత రచయిత వేటూరి సుందర మూర్తి గారు పరిచయం కావడం జరిగింది. అంతే కాదు చంద్రమోహన్ ” గంగ మంగ ” వంటి కొన్ని సినిమాలలో తన విలనిజం కూడా చూపించాడు. ఆయన నిజంగా సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే తనకు బాగా నచ్చితే ఎట్లా చేస్తారు.
ఇక ఆయన ఇలా సినిమాల్లో నటిస్తూనే కొన్ని రోజుల తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తారు. గులాబీ సినిమాలో తండ్రి పాత్ర పోషించిన ఆయన తర్వాత తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్, 7/G బృందావన్ కాలనీ, అతనొక్కడే మొదలగు చిత్రాలలో తండ్రి పాత్రలు పోషించి ఆ క్యారెక్టర్ కు 100% న్యాయం చేకూర్చారు. అంతేకాదు అతనొక్కడే సినిమా కు గాను చంద్రమోహన్ కి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా దక్కించుకున్నారు. ఈయన తన సినీ ప్రస్థానంలో మొదట చేసిన సిరిసిరిమువ్వ చిత్రానికి నంది అవార్డు గెలుచుకొని శభాష్ అనిపించుకున్నారు. ఆయన నటనా జీవితంలో ఒకటి రెండు సందర్భాలు మినహాయిస్తే ఎటువంటి కంట్రోల్ తప్పకుండా ఆయన నటనా జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగిస్తున్నారు
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…