Movie News

Priyanka Singh: ఘనంగా హల్ది వేడుక జరుపుకున్న బిగ్ బాస్ ప్రియాంక సింగ్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Priyanka Singh: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈ కార్యక్రమం మొదట్లో లేడీస్ లేకపోవడం వల్ల మగవారే లేడీ గెటప్స్ వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా లేడీ గెటప్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో సాయి తేజ్ ఒకరు. సాయి తేజ్ జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా లేడీ గెటప్స్ ద్వారా ఫేమస్ అయిన సాయి తేజ్ ఏకంగా సర్జరీ ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. ఇలా సాయి తేజ్ గా ఉన్నటువంటి ఈయన ప్రియాంక సింగ్ గా మారిపోయింది. ఈమె జెండర్ మార్చుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మానస్ తో ఈమె లవ్ ట్రాక్ బాగా హిట్ అయిందని చెప్పాలి.ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక సింగ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి ఒక పూజలో కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ ఇట్స్ డన్ అంటూ ఆ ఫోటోని షేర్ చేశారు.

Priyanka Singh: ఘనంగా హల్దీ వేడుక…

తాజాగా ఈమె ఏకంగా హల్దీ ఫంక్షన్ జరుపుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఒకసారిగా వైరల్ అయింది.ఇది చూసిన ఎంతోమంది నెటిజన్లు ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతోందా అంటూ సందేహం వ్యక్తం చేయడమే కాకుండా తనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.ఈ విధంగా ప్రియాంక సింగ్ హల్ది ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే ఏదైనా షూట్లో భాగంగా ఇలా ఫోటోలు దిగారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

17 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

24 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

36 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago