Murali Mohan : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ సుపరిచితులు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. ఇక రాష్ట్ర రాజకియాల్లోను తనదైన ముద్ర వేసుకున్నారు మురళీ మోహన్. ఇటీవల ఆయన అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కృష్ణ గారి గొప్పతనం గురించి వివరించారు.
కృష్ణ గారిని అలా ఏరా అని పిలిస్తే ఏమన్నారంటే…
మురళీ మోహన్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు చదివేటపుడు క్లాస్ మేట్స్. అప్పటినుండి కృష్ణ గారితో పరిచయం ఉందట మురళీ మోహన్ గారికి. ఇక కృష్ణ గారు సినిమాల్లోకి రావడం ఆ తర్వాత సూపర్ స్టార్ అవ్వడం చక చకా జరిగిపోయాయి. ఇక చదివేటప్పుడు కృష్ణను ఏరా.. అరేయ్.. అంటూ పిలుచుకునేవాళ్ళం కానీ సినిమాల్లోకి నేనొచ్చే సరికి కృష్ణ సుపర్ స్టార్ అయ్యాడు. అందుకే సినిమాల్లోకి వచ్చాక అలా పిలిస్తే బాగుండదని ఏమండీ అని పిలిచేవాడిని కానీ కృష్ణ గారు అలా పిలిస్తే ఏయ్ ఏంటి ఏవండీ అంటావ్ అంటూ అనేవాడు. కానీ ఆయన నాకన్నా పెద్ద హీరో అందుకే అలా ఎరా అని పిలవలేను అంటూ మురళీ మోహన్ వివరించారు.
ఇక డైరెక్టర్ ఒక సినిమా ప్లాప్ ఇస్తే మళ్ళీ ఆ హీరోకి ముఖం చూపించాలంటే చాలా ఇబ్బంది పడతారు, అందుకే కనపడరు. అయితే కృష్ణగారు మాత్రం అలా మొహం చాటే డైరెక్టర్లను పిలిచి మళ్ళీ ఆఫర్ ఇస్తాడు. ప్రొడ్యూసర్లు ముందుకు రారు అంటే కృష్ణ గారు హామీగా ఉండి సినిమా పూర్తి చేయిస్తారు. ఇక నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నా అంతే డిస్ట్రిబ్యూటర్లకు చెప్పి డబ్బు సర్దుబాటు చేసి సినిమా తీయిస్తారు. సినిమా విడుదల అప్పుడు కూడా మొత్తం ఫైనాన్స్ క్లియర్ అయ్యేవరకు విడుదల చేయానియ్యక పోతే కూడా కృష్ణ గారు హామీ ఇస్తూ సంతకం చేసి సినిమా విడుదల కానిస్తారు అంటూ ఆయన గొప్పతనం చెప్పారు మురళీ మోహన్ గారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…