Krishna Makeup Man Madhava Rao : కృష్ణగారి పర్సనల్ మేకప్ మ్యాన్ గా కొన్నేళ్లుగా ఆయనతో కలిసి పనిచేసిన మాధవరావు గారు కృష్ణ గారు మరణించిన తరువాత పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ ఆయనతో ఉన్న అనుబంధం అలాగే ఇండస్ట్రీ లో వచ్చిన మార్పులు అప్పట్లో మేకప్ ఎలా ఉండేది అప్పుడు ఉన్న హీరోలు ఎలా ఉండేవారు వంటి విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, సావిత్రి, వాణిశ్రీ వంటి అగ్ర తారలకు మేకప్ చేసిన ఆయన ఆ విశేషాలను అలాగే కృష్ణ గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు.
ఎన్టీఆర్ కు కాంతారావు సమానమైన నటుడు….
మాధవరావు గారు కృష్ణ గారికి మేకప్ మాన్ అయిన కూడా దాదాపు అందరు అగ్రహీరోలకు పనిచేసారు. ఇక అప్పటి విషయాలను చెబుతూ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారికి సమానమైన హీరో కాంతారావు గారు అంటూ చెప్పారు. ఇక అప్పట్లో ఆయన బిజీ ఆర్టిస్ట్, వారితో సమానమైన క్రేజ్ ఉండేది. ఆస్తులు కూడా బాగా ఉండేవి కాంతారావు గారికి ఆయన చెన్నై లో ఉన్న ఇల్లు చాలా పెద్దది అంటూ చెప్పారు మాధవరావు గారు.
అయితే ఆయన సినిమా నిర్మాణంలో డబ్బులు పెట్టి చాలా వరకు నష్టపోయారు అంటూ చెప్పారు మాధవరావు. ఇక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కృష్ణ గారు ఆయన బ్యానర్ లో సినిమాల్లో కాంతరావు గారికి అవకాశాలు ఇచ్చారు. అలా కాంతారావు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు అంటూ మాధవరావు గారు తెలిపారు. అయితే ఆయన గురించి నేటి తరం చెప్పకపోడానికి కారణం మరుగున పడిపోవడమే అంతే కాంతారావుగారే కాదు అప్పటి వారిలో రాజనాల, నాగభూషణం వంటి వారు కూడా కనుమరుగయ్యారు అంటూ మాధవరావు గారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…