Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ అనగానే సోషల్ మీడియా కు పండగ ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని నిర్మొహమాటంగా తనకు నచ్చినట్లు చెప్పి వివాదానికి కారణం అవుతాడు. అయితే వర్మ సినిమా స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. తనతో వర్క్ చేయాలనీ ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకుంటాడు. ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు వర్మ చేస్తున్న సినిమాల గురించి పెద్దగా చెప్పుకునేలా ఏం కనిపించదు. అయితే ఒకప్పటి వర్మ సినిమా స్టయిల్ సినిమాలకు కొత్త గుర్తింపు ట్రెండ్ ను తెచ్చాయి. అలాంటి వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన కృష్ణవంశీ సినిమాల్లో కుడా వర్మ ప్రభావం కనిపిస్తుంది. వర్మ ఆలోచనలు, భావనల గురించి కృష్ణ వంశీ కామెంట్స్ చేసారు.
ఆర్జీవి ఒక సోక్రటిస్, అరిస్టాటిల్ లాంటోడు…
కృష్ణ వంశీ తన గురువు ఆర్జీవి గురించి మాట్లాడుతూ అప్పుడే కాదు ఇప్పుడున్న ఆర్జీవి అన్నా నాకు ఇష్టమని చెప్పాడు. జాతిని జాగృతం చేయడానికి ప్రతి తరంలోను ఒకడు భూమి మీదకు వస్తాడు. అలాంటి వ్యక్తి ఆర్జీవి. అప్పట్లో సోక్రటిస్, అరిస్టాటిల్, గెలీలియో, యేసు ప్రభువు అలా వచ్చినవాళ్ళే. సోక్రటిస్, అరిస్టాటిల్ చెప్పినవి మొదట ప్రజలు గుర్తించలేదు భూమి గుండ్రంగా ఉందని అరిస్టాటిల్ చెప్పినందుకు ఆయనను చంపేశారు. అలానే గెలీలియో ఫోన్ కనిపెట్టినందుకు చంపేశారు. వాళ్ళు చెప్పిన విషయాలు అప్పటి తరంవారికి అర్థం కావు. అలానే ఆర్జీవి చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలంటే ఇంకా పోవాలి. ఈ తరం వారికి ఆ విషయాలు ఇంకా అర్థం కావు. అందుకే ఆయనను తిడుతున్నారు. కానీ ఆయన అవేవి పట్టించుకోరు అంటూ చెప్పాడు.
ప్రకాష్ రాజ్ తో సిట్టింగ్…
ఇక ప్రకాష్ రాజ్ నేను మందు కొట్టినప్పుడు ఇద్దరం కూర్చొని ఇళయరాజా పాటలు వింటాము. ఒక రెండు గంటలైనా అలా వింటూ గడిపేస్తాము. లేదంటే ప్రకాష్ నాతో పుస్తకాల గురించి పాత డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటాము. ఇవేవి కాదంటే రోడ్డు మీద తిరిగి వస్తాము అంతే అంటూ చెప్పారు కృష్ణ వంశీ.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…