Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.తాజాగ ఈయన నటించిన థాంక్యూ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ క్రమంలోనే ఈయన నటించిన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా సినిమా ఈనెల 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. సాధారణంగా బాలీవుడ్ మీడియా ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి ఫోకస్ చేస్తారు. ఈ క్రమంలోనే నాగచైతన్యకు కూడా తన పర్సనల్ విషయాల గురించి ప్రస్తావించక తప్పలేదు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య ఎప్పుడు కూడా సమంత గురించి ప్రస్తావించలేదు. కేవలం ఇద్దరం సంతోషంగా ఉండడం కోసమే విడాకులు తీసుకున్నామని విడాకులు తీసుకోవడం వల్ల నేను సామ్ ఇద్దరం హ్యాపీగా ఉన్నామని ఒకసారి మాత్రమే తన విడాకుల గురించి ప్రస్తావించారు.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి ప్రశ్నలు అడగడంతో చైతన్య కాస్త ఘాటుగా స్పందించారు నా పర్సనల్ విషయాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు. ఇక సమంత గురించి కాకుండా విడాకుల తర్వాత నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే నాగచైతన్యను ప్రశ్నిస్తూ అది కేవలం రూమరేనా? లేక నిజమా? అని ప్రశ్నించారు.
ఇలా శోభిత డేటింగ్ గురించి ప్రశ్న రావడంతో నాగచైతన్య శోభిత పేరు విన్నప్పుడు చిన్న నవ్వు నవ్వేసి ”I’m just gonna smile” అని సమాధానం చెప్పారు.ఇలా నాగచైతన్య నవ్వుతూ సమాధానం చెప్పడంతో ఆయన తనతో డేటింగ్ లో ఉన్నారని ఇలా క్లారిటీ ఇచ్చారు అంటూ పలువురు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మరికొందరు స్పందిస్తూ నవ్వితేనే డేటింగ్ లో ఉన్నట్టా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాగచైతన్యకు నటి శోభిత గురించి ప్రశ్న ఎదురవడంతో మరోసారి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…