Krishna Vamsi : తెలుగు విలక్షణ దర్శకుడు కృష్ణ వంశీ తన సినిమాలలో కథా ఎంపికలో జాగ్రతగా ఉంటారు. సామాజిక అంశాలతో, సమాజానికి ఉపయోగపడే విషయన్నే సినిమాగా తీస్తారు. ఇక ఉమ్మడి కుటుంబాలనే తన సినిమాల్లో ఎక్కువగా చూపించే కృష్ణ వంశీ కుటుంబ విలువలను కూడా తన సినిమాల్లో చూపిస్తారు. రంగ మార్తాండా సినిమాతో మళ్ళీ చాలా రోజుల తరువాత రాబోతున్న కృష్ణ వంశీ తన చేతినుండి చేజారిపోయిన పెద్ద ప్రాజెక్టుల గురించి, తన డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం గురించి మాట్లాడారు.
బాలకృష్ణ తో సినిమా ఆగిపోడానికి ఆయనే కారణం…
కృష్ణ వంశీ గారి కెరీర్ లో చాలా రోజులుగా పెద్ద హాట్ సినిమాలు లేవు. గోవిందుడు అందరివాడేలే సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడనుకున్నా అది జరగలేదు. ఆ సినిమా కూడా ప్లాప్ అయి నిరాశపరిచింది. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా ఆఫర్ వచ్చింది కృష్ణ వంశీకి ఇక అదే సమయంలో బాలయ్య బాబు 100 సినిమా ఆఫర్ వచ్చింది. దీంతో దిల్ రాజుగారితో ఆ విషయాన్ని చెప్పగా పెద్ద హీరోతో 100 సినిమా చాలా మంచి ఆఫర్ వదులుకోకండి చేయండి అది అయ్యాక మనం చేదాం అని అన్నారట. బాలయ్య బాబు కి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. రైతు నేపథ్యంలో సాగే కథ అందునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగే కథా అవ్వడంతో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఫర్వాలేదా అని అడిగారట బాలకృష్ణను. ఇక బాలయ్య అయినా పర్లేదు అని ఓకే చేసాక ఒక కీలక పాత్రకు అమితాబ్ బచ్చన్ అయితేనే బాగుంటుందని బాలకృష్ణ, కృష్ణ వంశీ అనుకున్నారట. ఇక అయనను అడుగగా బిజీగా ఉండి చేయలేనని చెప్పడంతో ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్నారు.
అమితాబ్ బచ్చన్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుందని అలా ప్రాజెక్ట్ ను వాయిదా వేశారట. ఇక దిల్ రాజు సినిమా కూడా అలా వెనక్కి పోయింది. ఇక తన జీవితంలో డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం కథను కేవలం చిరంజీవి, మహేష్ బాబు తో చేయాలని అయితే వాళ్ళు ఇప్పట్లో చేసే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. వందేమాతరం దేశ భక్తికి సంబంధించిన కథ, ఆ కథలో నాకు వాళ్లిద్దరే కనిపించారు అందుకే వాళ్లతోనే చేయాలని అనుకున్నాను అంటూ చెప్పారు కృష్ణ వంశీ.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…