Featured

Prathap Pothen : సినీ పరిశ్రమలో మరో విషాదం… తన నివాసంలో విగత జీవిగా ప్రతాప్ పోతెన్..!

Prathap Pothen : సినీ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన ప్రతాప్ పొతెన్ తుది శ్వాస విడిచారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా వున్నారు ఆయన. ఉదయం పని చేయడానికి పనిమనిషి వచ్చాక ఆయన మరణ వార్త అందరికీ తెలిసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈయన మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

మలయాళంలో మొదట తన ప్రస్తానాన్ని మొదలు పెట్టి…

ప్రతాప్ పొతెన్ మొదట మలయాళం లో తన సినీ ప్రస్తానాన్ని ‘ఆరవం’ అనే సినిమాతో ప్రారంభించాడు. ప్రతాప్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించాడు. నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రచయితగా కూడా అభిమానులకు చేరువ అయ్యాడు. సినీ నటి రాధిక మొదట ప్రతాప్ ని 1985 లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వళ్ల వీరు వారి దాంపథ్య జీవితాన్ని కొంసాగించలేకపోయారు. పెళ్ళి అయిన ఒక సంవత్సరానికే అంటే 1986 లో విడాకులు తీసుకోవడం జరిగింది.

మలయాళం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతాప్ చివరిగా మమ్ముటీ హీరోగా తెరకెక్కిన ‘సీబీఐ5 ది బ్రెయిన్‌’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదల అయింది. ఈయనకు తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రతాప్ పొతెన్ మృతి తో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago