Prathap Pothen : సినీ ఇండస్ట్రీ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన ప్రతాప్ పొతెన్ తుది శ్వాస విడిచారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా వున్నారు ఆయన. ఉదయం పని చేయడానికి పనిమనిషి వచ్చాక ఆయన మరణ వార్త అందరికీ తెలిసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈయన మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

మలయాళంలో మొదట తన ప్రస్తానాన్ని మొదలు పెట్టి…
ప్రతాప్ పొతెన్ మొదట మలయాళం లో తన సినీ ప్రస్తానాన్ని ‘ఆరవం’ అనే సినిమాతో ప్రారంభించాడు. ప్రతాప్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించాడు. నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రచయితగా కూడా అభిమానులకు చేరువ అయ్యాడు. సినీ నటి రాధిక మొదట ప్రతాప్ ని 1985 లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వళ్ల వీరు వారి దాంపథ్య జీవితాన్ని కొంసాగించలేకపోయారు. పెళ్ళి అయిన ఒక సంవత్సరానికే అంటే 1986 లో విడాకులు తీసుకోవడం జరిగింది.

మలయాళం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతాప్ చివరిగా మమ్ముటీ హీరోగా తెరకెక్కిన ‘సీబీఐ5 ది బ్రెయిన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదల అయింది. ఈయనకు తెలుగులో ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రతాప్ పొతెన్ మృతి తో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

































