Movie News

Lakshmi : బాలీవుడ్ లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్… నటనకు అవార్డులందుకున్న నటి..!

Lakshmi : ఓ బేబీ సినిమాతో మళ్ళీ హుషారుగా నటించి మెప్పించిన అలనాటి తార లక్ష్మి చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఒకే భాషకు పరిమితం కాకుండా తమిళ, కన్నడ, హిందీ అంటూ చాలా భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మహాలక్ష్మి సొంతూరు నెల్లూరు. అయితే తండ్రి, తల్లి, అమ్మమ్మ అందరూ సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో చెన్నై లో స్థిరపడ్డారు. అలా లక్ష్మి చెన్నై లో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఎర్రగుడిపాటి లక్ష్మి తండ్రి వై వి రావు దర్శకులు, నటులు.

హిందీ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు…

లక్ష్మి సినిమా ప్రయాణం తమిళ సినిమాతో మొదలయింది. ఆ తరువాత తమిళ, తెలుగు, కన్నడ హిందీ లలో నటించింది. హిందీలో నటించిన తొలి సినిమా ‘జూలీ’ లో తన నటనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చుకుంది లక్ష్మి. అలా బాలీవుడ్ లో అవార్డు అందుకున్న తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసిన లక్ష్మి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.

చాలా సినిమాల్లో తల్లి పాత్రలలో అలాగే విలన్ పాత్రలలో మెప్పించిది. తన లైఫ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ మాత్రం ‘మిథునం’ సినిమా అనే చెప్పాలి. మిథునం లో బాలసుబ్రమణ్యం గారితో ఆమె నటన చాలా బాగుంటుంది. ఇక మళ్ళీ ఓ బేబీ సినిమాల్లో పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు లక్ష్మి. ఇక లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఇటీవలే ఐశ్వర్య చెప్పడం, సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పడం విశేషం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago