Sushmita Sen: సుస్మిత ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మాజీ ప్రపంచ సుందరిగా పేరు సంపాదించుకున్న సుస్మితసేన్ నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.అయితే ఈమె పెళ్లి చేసుకోకపోయినప్పటికీ పలువురు హీరోలతో కలిసి ఈమె సహజీవనం చేశారు.అయితే సుస్మిత సేన్ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని వారి బాధ్యతలను చూసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తనకన్నా వయసులో చిన్నవాడైనా రొహ్మన్ షాల్ అనే కుర్రాడితో ఈమె సహజీవనం చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అయితే కొద్ది రోజులకి వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా సుస్మితసేన్ రొహ్మన్ షాల్ అనే కుర్రాడితో బ్రేకప్ చెప్పకున్న తర్వాత మరోసారి మరొక వ్యక్తితో ప్రేమలో పడినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సుస్మిత మాజీ ఐపీఎల్ మొదటి చైర్మన్ కమిషనర్ గా ఉన్నటువంటి లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్న విషయాన్ని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నటి సుస్మిత సేన్ తో కలిసి తాను డేటింగ్ లో ఉన్నానని నా బెటర్ హాఫ్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ విధంగా సుస్మిత సేన్ తో కలిసి కొత్త ప్రయాణం మొదలైందని అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మరొక పోస్టు ద్వారా తెలిపారు. ఈ విధంగా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన లలిత్ మోడీ మరో పోస్టులో అది కూడా త్వరలోనే జరగచ్చేమో అంటూ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా వీరి పెళ్లికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది స్పందిస్తూ లేటు వయసులో ఘాటు ప్రేమలు ఏమిటో అంటూ.. పెద్ద ఎత్తున ఈ జోడి పై కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…