Krishnam Raju:దివంగత నటుడు టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈనెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన సంస్కరణ సభను తన సొంత గ్రామమైన మొగల్తూరులో నిర్వహించారు. ఈ క్రమంలోనే సుమారు 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టడంతో పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడును చూడటం కోసం కృష్ణంరాజు అభిమానులు ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఇక తన పెదనాన్న సంస్కరణ సభ కోసం తరలివచ్చిన అభిమానులకు ప్రభాస్ కడుపునిండా భోజనం పెట్టి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వివిధ రకాల భోజనాలను తయారు చేయించి అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టి పంపించారు. అయితే ఈ సంస్కరణ సభ కోసం ప్రభాస్ సుమారు 6 నుంచి ఏడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.సంస్కరణ సభ కోసం వచ్చిన అభిమానులకు టన్నులకొద్దీ ఆహార పదార్థాలను తయారు చేయించారు.
ఈ క్రమంలోనే ఈ ఆహార పదార్థాలకు సంబంధించిన మెనూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణంరాజు సంస్కరణ సభ కోసం ప్రభాస్ ఏకంగా 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 4 టన్నుల సందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు.. ఇవి కాక మరో 22 రకాల నాన్ వెజ్ తయారు చేయించినట్లు తెలుస్తోంది.
ఇలా సంస్కరణ సభ కోసం వచ్చిన అభిమానులకు ఇన్ని రకాల ఆహార పదార్థాలను తయారు చేయించడంతో మరోసారి వీరి అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిపోయింది. ఇంత బాధలో ఉన్నప్పటికీ అభిమానుల ఆకలి గురించి ఆలోచించిన ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పాలి. అయితే కృష్ణంరాజు కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేసుకున్న తర్వాత ప్రభాస్ అభిమానుల ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చటించి మరి కాసేపట్లో భోజనాలు తయారవుతాయి ప్రతి ఒక్కరు తప్పకుండా భోంచేసి వెళ్లాలని అభిమానులకు సూచించారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…