Krithi Sanon : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, కలిసి జీవించడం, పెళ్లి ఇవన్నీ కామన్. అయితే రీసెంట్ గా ఒక జంట పేరు బాగా వార్తల్లో నిలుస్తోంది. వాళ్ళే ప్రభాస్ కృతి సనన్. చాలా రోజులుగా ప్రభాస్ అనుష్క ను పెళ్లి చేసుకుంటాడంటూ వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ మాట్లాడుకునేవాళ్ళు. నిజంగానే వాళ్ళు పెళ్లి చేసుకుంటే చూడటానికి చాలా బాగుటుంది అంటూ అభిమానులు కూడా సంబరపడిపోయారు. అయితే అవేవి నిజం కాదని ప్రస్తుతం డార్లింగ్ ఒక బాలీవుడ్ భామ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు తోడు వాళ్ళ చేస్టలు తోడవడంతో వీళ్ళ మధ్య నిజంగా ఏదో ఉంది అన్న అనుమానం అందరికీ బలపడింది. ఇక ఈ విషయాల మీద రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ క్లారిటీ ఇచ్చేసింది.
మోకాళ్ళ మీద కూర్చొని డార్లింగ్ ప్రపోసల్…
కృతి సనన్, ప్రభాస్ ఇద్దరూ కూడా ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆ సినిమా ఏమో కానీ వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు, త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటికి బలం చేకూర్చేలా మరో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ‘భేడియ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కృతి పేరు వేరొకరి మనసులో ఉంది ఆయన ఇక్కడ లేడు దీపిక తో షూటింగ్ లో ఉన్నాడు అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్, కృతి ల ప్రేమ గురించి చెప్పారు. ఇక మోకాళ్ళ మీద కూర్చొని ప్రభాస్ కృతికి లవ్ ప్రపోజ్ చేసినట్లు కూడా వార్తలు రాసేసారు కొంతమంది మీడియా వాళ్ళు.
ఇవన్నీ చూస్తూంటే త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ గట్టిగా అభిమానులకు అనిపించినా ఈ ఆశలపై నీళ్లు చల్లేసింది కృతి సనన్. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. ప్రభాస్ తో ఉన్నది ప్రేమ కాదు, పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదు. రియాల్టీ షోలో వరుణ్ ధావన్ కొంచెం హద్దులు దాటి మాట్లాడాడు. సరదాగా చేసిన వ్యాఖలు రూమర్స్ కి దారితీశాయి. నా పెళ్లి ఎవరో ఒకరు డేట్ ఫిక్స్ చేసే ముందు నన్ను పెళ్లి విషయం క్లారిటీగా చెప్పనివ్వండి. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు పుకార్లు మాత్రమే నిజాలు కావు అంటూ తెల్చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…